Home » Indian 2: వైరల్ అవుతున్న భారతీయుడు తాతయ్య పిక్.. కమల్ ఈజ్ బ్యాక్!

Indian 2: వైరల్ అవుతున్న భారతీయుడు తాతయ్య పిక్.. కమల్ ఈజ్ బ్యాక్!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ 90వ దశకంలో స్పెషలిస్ట్ మేకప్ ద్వారా ఎవ్వరు చెయ్యలేని ఫీట్ ను సాధించారు. “భారతీయుడు” సినిమాలో వృద్ధుడి పాత్రలో నటించి యావత్ భారత్ ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ సినిమా అప్పట్లోనే ఓ రేంజ్ లో విజయం సాధించింది. కమల్ పేరు భారత దేశమంతటా మారుమ్రోగిపోయింది. అంతే కాదు.. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికి రెండు దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు.

Advertisement

అంతే కాదు ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ తో కలిసి “భారతీయుడు 2” సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి వచ్చే కమల్ హాసన్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు. ఎదురు చూపులు ఫలించినట్లు కమల్ హాసన్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెబుతూ.. భారతీయుడు 2 సినిమా నుంచి కమల్ హాసన్ లుక్ ను దర్శకుడు శంకర్ రివీల్ చేసారు. లెజెండరీ సుభాష్ చంద్రబోస్ లాగా పూర్తి ఖాకీ దుస్తులు ధరించి, నిస్సందేహంగా, భారతీయుడు తాతయ్య గెటప్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. నేటి తరం ప్రేక్షకులు కమల్ ను ఆ గెటప్ లో చూడలేదు. దీనితో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. శంకర్, కమల్ హాసన్ కాంబో లో వస్తున్నా సినిమా కావడం, ఇప్పటికే ఓ రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీగానే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు శంకర్ అందుకోగలడో లేదో తెలియాలంటే ఈ సినిమా విడుదల అయ్యేదాకా ఎదురుచూడాల్సిందే.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

రాత్రిపూట మృతదేహాన్ని ఒంటరిగా ఉంచకూడదు ఎందుకో తెలుసా..?

అధికమాస అమావాస్య నాడు ఈ తప్పులు ఎట్టి పరిస్థితిలో చేయకండి..! శివుని ఆగ్రహానికి లోనవుతారు..!

Chanikya niti : విజయవంతమైన వ్యాపారవేత్త కావాలంటే ఈ లక్షణాలు మీలో కచ్చితంగా ఉండాలి..!

Visitors Are Also Reading