నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజాగా చిత్రం అమిగోస్. నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేనీ, యలమంచిలి రవి ప్రకాశ్ నిర్మించారు. మనుషులను పోలిన మనుషులు అనే విభిన్న కథతో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 10, 2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో అమిగోస్ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్లు ఎంత వసూలు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
అమిగోస్ చిత్రం విషయానికొస్తే.. నైజాంలో 4.5 కోట్లు, సీడెడ్ లో 2.5 కోట్లు, ఆంధ్రాలో రూ.7కోట్ల వరకు జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ 14.5 కోట్ల వద్ద ముగిసింది. కర్ణాటకలో రూ.80లక్షలు, ఓవర్సీస్ లో రూ.90లక్షల వరకు బిజినెస్ జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.16కోట్లకు పైగా చేరుకుది. అదేవిధంగా అమిగోస్ ప్రపంచ వ్యాప్తంగా 750 స్క్రీన్లలో విడుదలైంది. నైజాంలో 160 స్క్రీన్లు, ఆంధ్రాలో 210 స్క్రీన్లలో అమిగోస్ ఆడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 425 స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల అయింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ లో 260 స్క్రీన్లలో విడుదలైంది.
Advertisement
భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదని తెలుస్తోంది. ఫస్ట్ డే అమిగోస్ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా రూ.3.5 నుంచి రూ.5కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో బింబిసార తొలి రోజు రూ.7.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాని బింబిసార చిత్రంతో పోల్చితే.. తక్కువ కలెక్షన్లు వచ్చినట్టు స్పష్టమవుతోంది. ఈ వీకెండ్ లో పుంజుకొని కలెక్లన్లు వస్తే నిర్మాతలకు మంచి లాభం వచ్చే అవకాశముంది. అమిగోస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ రూ.17 కోట్ల వద్ద ఉంది. నాలుగైదు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందనే నమ్మకంతో నిర్మాతలున్నారు.
Also Read : “పుష్ప”లో కేశవ పాత్రను వదిలేసుకున్న బిగ్ బాస్ స్టార్…అతను ఎవరో తెలుసా..?