Home » ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ స్పెషాలిటీ.. ఏమిటో తెలుసా..?

ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ స్పెషాలిటీ.. ఏమిటో తెలుసా..?

by Sravya
Ad

వినాయక చవితి పండుగని హిందువులందరూ కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఖైరతాబాద్ మహా గణపతి ప్రస్తానం 1954లో ఒక్క అడుగుతో మొదలైంది. 69వ సంవత్సరాలకి చేరుకుంది. పర్యావరణహితంగా పూర్తి మట్టితో తయారు చేసిన మహాగణపతి ఈసారి 63 అడుగుల ఎత్తులో దర్శనం ఇవ్వబోతున్నారు. శుక్రవారం నాడు మహాగణపతికి నేత్రోనిలం కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఖైరతాబాద్ మహాగణపతిని వివిధ రూపాల్లో శిల్పి అయిన చిన్న స్వామి రాజేంద్రన్ తీర్చిదిద్దారు. ఈసారి గణపతి 63 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పులో 45 టన్నుల బరువుతో దర్శనం ఇవ్వబోతున్నారు.

Advertisement

Advertisement

ఒక చేతిలో గంధం వరాహదేవితో కలిసి ఉన్న గణపతిని పూజ చేస్తే అంతా శుభం జరుగుతుంది. ఈ గణపతిని తయారు చేయడానికి ఒక చుక్క కూడా పిఓపి ని ఉపయోగించలేదు. మొదటి స్టీల్ తో రూపును తీసుకొచ్చి ఆ తర్వాత జాలిని అమర్చి, గడ్డి, మట్టితో రెండవ లేయర్ చేసారు. అవుట్ లైన్ గా సాండ్ లాంటివి వాడారు. మొత్తం ఐదు లేయర్లు గణపతిని తయారు చేశారు. వాటర్ పెయింట్ లని వాడారు దీంతో వర్షం పడినా కూడా విగ్రహం కరగదు. నిమజ్జనం టైంలో వర్షం పడినా కూడా ఇబ్బంది రాదు నిమజ్జనము పూర్తిగా జరగాక ఎనిమిది గంటల్లో నీటిలో కరుగుతుంది.

Also read:

Visitors Are Also Reading