తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ గా పేరుపొందిన నటుడు కైకాల సత్యనారాయణ. ఆయన ముందుగా ఇండస్ట్రీలోకి హీరోగా ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,కమెడియన్ గా ఇలా ఎన్నో పాత్రలు చేశారు. ముఖ్యంగా కైకాల సత్యనారాయణ రూపాన్ని చూస్తే యమధర్మరాజు గుర్తొస్తాడు. చాలామందికి యమధర్మరాజు ఎలా ఉంటాడో తెలియదు కానీ కైకాల సత్యనారాయణను చూస్తే యమ ధర్మరాజు ఇలానే ఉంటాడు అని అనుకునే విధంగా ఆయన ఆ పాత్రలో నటించారు. ఇండస్ట్రీలో దాదాపుగా 800 చిత్రాల్లో నటించిన ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నాడు.
Advertisement
also read:అందుకే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నా…నయన్ సంచలన వ్యాఖ్యలు..!
Advertisement
రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశాడు కైకల సత్యనారాయణ. అలాంటి లెజెండరీ యాక్టర్ ని ఇండస్ట్రీ కోల్పోవడం తీరని లోటు అని చెప్పవచ్చు. ఆయన మరణానికి ఎంతో మంది ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా సంతాపం ప్రకటించి మాట్లాడుతూ సత్యనారాయణ గారి మరణం నన్ను ఎంతో కలచివేసింది అని అన్నారు. ఆయన నన్ను ఎప్పుడూ తమ్ముడు అంటూ ఒక తోబుట్టువుల భావించాడని గుర్తు చేసుకున్నాడు.
అలాంటి కైకాల సత్యనారాయణకు ఆ రెండు అంటే చాలా ప్రాణం అని అన్నారు .. ఇంతకీ అది ఏంటయ్యా అంటే..ఒకటోది నటన , రెండవది భోజనం..ఈయనకు ఈ రెండంటే చాలా ఇష్టమని చిరంజీవి తెలియజేశారు. నా శ్రీమతి సురేఖ చేతి వంటను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారని చెప్పారు. గత ఏడాది కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వెళ్లి మరీ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయించిన విషయం మనందరికీ తెలిసిందే.
also read: