Home » JD Chakravarthy : కట్టుకున్న భార్యనే నాకు విషం పెట్టి చంపాలని చూసింది..!

JD Chakravarthy : కట్టుకున్న భార్యనే నాకు విషం పెట్టి చంపాలని చూసింది..!

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది నటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం అలాగే వచ్చి పాతుకు పోతారు. ఇక కొంతమంది తారాజువ్వల ఎగిసి.. సైలెంట్ అయిపోతారు. అచ్చం అలాగే తారాజువ్వల ఎగిసి.. సైలెంట్ అయిన హీరోలలో జెడి చక్రవర్తి ఒకరు. జెడి చక్రవర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక హీరోగా, విలన్, స్క్రిప్టు రైటర్, దర్శకుడు, నిర్మాత ఇలా ఎన్నో విభాగాలలో రాణించి, తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని అందించారు జెడి చక్రవర్తి.

Advertisement

53 ఏళ్ల జెడి చక్రవర్తి ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఇటీవల… యాంకర్ విష్ణుప్రియ తో సినిమా చేశాడు జె.డి చక్రవర్తి. అయితే ఈ సినిమా తీసిన నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు జెడి చక్రవర్తి. అయితే తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… తనపై విష ప్రయోగం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జె డి చక్రవర్తి. తన భార్యనే ఈ పని చేసిందని కూడా చెప్పారు. తనకు గతంలో ఎలాంటి వ్యాధులు లేవని… తన ఆరోగ్యం బాగుండాలని ఓ వ్యక్తి కషాయం ఇచ్చేవాడు అని తెలిపాడు జెడీ చక్రవర్తి. ప్రతిరోజు ఆ కషాయం నాతో తాగించేవాడని చెప్పారు.

Advertisement

jd chakravarthy anukriti govind sharma

jd chakravarthy anukriti govind sharma

అయితే ఈ కషాయాన్ని దర్శకుడు ఖాసీం.. ఒక రోజు తాగగా, అతనికి విపరీతంగా జ్వరం వచ్చిందని జెడీ చక్రవర్తి తెలిపాడు. ఇక కొన్ని రోజుల తర్వాత… తనకు బ్రీతింగ్ సమస్య వచ్చిందన్నాడు జెడి చక్రవర్తి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా రోగం తగ్గలేదని చెప్పాడు. ఈ తరుణంలోనే నాగర్జున అనే వైద్యుడు… చికిత్స అందించి… తన ప్రాణాలు కాపాడినట్లు చెప్పుకొచ్చాడు జెడి చక్రవర్తి. అలాగే తన బాడీ మొత్తం టెస్ట్ చేసి… విష ప్రయోగం జరిగిందని ఆ డాక్టర్ చెప్పినట్లు మీడియాకు స్పస్టం చేసాడు జెడి చక్రవర్తి. తాను రెగ్యులర్ గా తాగే కషాయంలోనే తన భార్య విషయం కలిపిందని… వెల్లడించాడు జె.డి చక్రవర్తి. అయితే డాక్టర్ నాగార్జున చికిత్స కారణంగా బతికి బయటపడినట్లు చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి :

ప్రభాస్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. దమ్ముంటే ఓమ్ రౌత్ ను కొట్టాలంటూ..!

విరూపాక్ష సినిమాలో సంయుక్త పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading