టీమిండియా వెటరన్ క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2010లో సౌత్ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు జయదేవ్. ఆ మ్యాచ్ లో 26 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు జయదేవ్. ఆ తర్వాత మళ్లీ ఈ సౌరాష్ట కుర్రాడికి అవకాశం దక్కలేదు. అయితే తాజాగా జయదేవ్ కు టీమిండియాలో చోటు దక్కింది.
Advertisement
ఆస్ట్రేలియాతో టీ20 వరల్డ్ కప్ జరుగుతుండగానే, వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తో జరగబోయే సిరీస్ ల కోసం చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్లను ఎంపిక చేసింది. అయితే, బంగ్లాదేశ్ సిరీస్ కోసం ఎంపిక చేసిన టీమ్ ఇండియా సీనియర్ బౌలర్ మొహమ్మద్ షమీ గాయపడ్డడంతో అతను సిరిస్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో టీమిండియా వెటరన్ ప్లేయర్, దేశవాళీ టోర్నీలో అదరగొడుతున్న జయదేవ్ ను ఎంపిక చేశారు.
Advertisement
దీంతో 12 ఏళ్ల తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకునే అవకాశం దక్కడంతో జయదేవ్ సంతోషంలో ఉబ్బితబ్బిభయ్యాడు. కానీ, తొలి టెస్ట్ ఆడే అవకాశం మాత్రం చిన్న సమస్యతో దూరమైంది. షమి స్థానంలో జయదేవ్ ను చివరి క్షణంలో ఎంపిక చేయడంతో, జయదేవ్ వీసా సమస్యలు తలెత్తాయి. తొలి టెస్ట్ కంటే ముందే, జయదేవ్ ను బంగ్లాదేశ్ పంపే ప్రయత్నాలను బీసీసీఐ చేసిన, అవి ఫలించలేదు. దీంతో జయదేవ్ తొలి టెస్ట్ కు దూరం అయ్యాడు. జయదేవ్ కెప్టెన్సీలోని సౌరాష్ట్ర జట్టు ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీని గెలిచింది. ఈ టోర్నిలో జయదేవ్ ప్రదర్శన ఆధారంగా అతనికి జాతీయ జట్టులో చోటు దక్కింది.
ఇవి కూడా చదవండి : బిగ్ బ్రేకింగ్: సరోగసి ద్వారా బిడ్డను కనబోతున్న ఉపాసన..!?