1980 లో తమ అందంతో, నటనతో వరుస సినిమా ఆఫర్లతో పోటీపడిన శ్రీదేవి, జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం విషయంలో వీరిద్దరూ ఎంత అయితే పోటీపడేవారో సినిమాల్లో అవకాశాలు అందుకోవడంలో కూడా అంతే పోటీపడేవారు. ఎంతోమంది స్టార్ హీరోలతో విడివిడిగా నటించిన వీరిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలా ఎన్నో సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులకు కన్నుల పండుగగా కనిపించిన వీరిద్దరి మధ్య ఎవరికీ విభేదాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.అయితే తాజాగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా లేదా అన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ జయసుధ. అటు సినిమాలో, ఇటు రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్న సహజ నటి జయసుధ.
రీసెంట్ గా ఒక మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. అప్పట్లో సీనియర్ హీరోలతో నటించడం చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత అలవాటైపోయింది. చంద్రమోహన్, శోభన్ బాబు నాకు మంచి స్నేహితులు. ఇక చాలామంది నటులు తమ వ్యక్తిగత సమస్యలను శోభన్ బాబుతో ఎక్కువగా చూపిస్తున్నారు. ఆయన కూడా ఓపిగ్గా విని సలహాలు ఇచ్చేవారు అంటూ జయసుధ అన్నారు. ఇక తెలుగులో జయప్రద, రాధిక, నేను మంచి స్నేహితులము.రాధిక ఛాలెంజ్ ఫ్రెండ్ వారి ఇంట్లో దాదాపు మూడేళ్ల పాటు ఉన్నాను అంటూ ఆమె చెప్పింది. ఇకపోతే శ్రీదేవి, జయప్రద మధ్య కాంట్రవర్సీ గురించి ఆమె మాట్లాడుతూ.. జయప్రద, శ్రీదేవి హిందీ ఫీల్డ్ కు వెళ్లిన తర్వాత వారి మధ్య ఏం జరిగిందో నాకు ఐడియా లేదు.
Advertisement
Advertisement
అయితే సినిమా సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు అందరూ అంటుంటారు. జయప్రదతో నాకు మంచి స్నేహం ఉంది. కానీ, పర్సనల్ విషయాలు మాట్లాడుకునేంత స్నేహం లేదు అంటూ జయసుధ తెలిపారు. మొత్తానికి అయితే జయప్రద, శ్రీదేవి మధ్య విభేదాలు ఉన్నాయి అని చెప్పకనే చెప్పారు జయసుధ. ఇక జయసుధ విషయానికి వస్తే.. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, మళ్లీ పెళ్లి, వారసుడు వంటి సినిమాలలో నటించిన ఈమె ఇప్పుడు రాజకీయాలలో మళ్ళీ బిజీ అయిపోయారు.
మరిన్ని టాలీవుడ్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!