Home » Jan 28th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 28th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

జనాభాకు తగ్గట్టుగా అభివృద్ధి సాధించడంలో చైనా ఆదర్శమని కేటీఆర్ అన్నారు. టెక్నాలజీ పరంగా భారత్‌ ఇంకా వెనుకబడి ఉందని….గత మూడేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు.

Advertisement

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. ఇవాళ సీబీఐ విచారణకు హాజరవుతున్నానని కేసు విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతించాలని తనతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతివ్వాలని కోరారు.

హైదరాబాద్‌ జీ-20 స్టార్టప్-20 సదస్సు ప్రారంభం అయ్యింది. ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సదస్సులో 20దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement


ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నెల 31న వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రేపటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమకు వర్ష సూచన ఉందని సమాచారం.

సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ్టి విశాఖ పర్యటన రద్దు అయ్యింది.

నేటి నుంచి తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలు జరుగుతున్నాయి. పదోన్నతులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జరగనుంది.

తిరుమల శ్రీవారి ఆలయంలో రథస్తమి వేడుకలు జరుగుతున్నాయి. సప్తవాహనాలపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు.

Visitors Are Also Reading