Home » NTRను కాలితో తన్నిన జమున… భగ్గుమన్న ఫ్యాన్స్, చివరికి ఏమైంది అంటే?

NTRను కాలితో తన్నిన జమున… భగ్గుమన్న ఫ్యాన్స్, చివరికి ఏమైంది అంటే?

by Bunty
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీ తొలి తరం కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జమున. ఈరోజు ఉదయం తన స్వగృహంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. ఈ మృతి పై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వయసు 86 ఏళ్ళు. ఈమె మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీగా సినీ రాజకీయాల్లో తన వంతు ప్రజాసేవ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

READ ALSO : టీచర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం

Advertisement

జమున 1936 ఆగస్టు 30న కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్య దేవి. తండ్రి ఒక వ్యాపారవేత్త. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. సినీ నటుడు జగ్గయ్యది కూడా జమున గ్రామమే. అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర అగ్ర నటుల సరసన హీరోయిన్ గా నటించారు. జమున తన కెరీర్ లో ఎన్నో పాత్రలలో నటించినప్పటికీ ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం శ్రీకృష్ణ తులాభారం చిత్రంలోని సత్యభామ పాత్ర.

Advertisement

అయితే ఆమె సినిమా కెరీర్ లో అనేక మరుపురాని ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ సినిమా సన్నివేశంలో ఎన్టీఆర్ ను జమున కాలితో తన్నడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా నటిస్తే, సత్యభామగా జమున నటించారు. ఆ పాటలో భాగంగా కృష్ణుడిని ఆమె కాలితో తన్నే సీన్ లో నటించగా, ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం అయింది. అయితే పాత్ర కోసమే తాను అలా చేసినట్లు జమున వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఆ వివాదాన్ని పక్కన పెడితే అప్పటికీ, ఇప్పటికీ సత్యభామ అంటే జమునే గుర్తొస్తుంది.

read also : Axar Patel Marriage Photos : ఘనంగా అక్షర్ పటేల్ పెళ్లి, ఫోటోలు వైరల్

Visitors Are Also Reading