ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అందరూ జరిగేది కేవలం ఆట మాత్రమే కాదు, అంతకుమించి ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ప్రతి ఒక్కరం చూస్తూనే ఉన్నాం ఎన్నో రకాల ఎమోషన్స్, ప్రతి ఒక్కరికి ఉత్సాహం, చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగే రోజున ఫ్యాన్స్ ను ఆపడం ఎవరితరం కాదు. నిన్న మ్యాచ్లో ఓపెనర్ లు త్వరగానే అవుట్ అయినప్పటికీ పాక్ బ్యాటర్లు బాబర్ అజామ్, కీపర్ మహమ్మద్ రిజ్వాన్ మంచి పార్ట్నర్షిప్ నెలపొల్పారు.
వేగంగా ఆడకపోయినప్పటికీ ఇన్నింగ్స్ ను మాత్రం కుదుటపరిచారు. 155 కు రెండు వికెట్ల వద్ద పాకిస్తాన్ మంచి పొజిషన్లో కనిపించింది. అక్కడి నుంచే పతనం మొదలైంది. బాబర్ 50 కొట్టి అవుట్ అయితే, రిజ్వాన్ 49కే వెనుతిరిగాడు. సాధారణంగా రిజ్వాన్ 50 కొట్టిన, లేకపోతే సెంచరీ చేసినా సరే తన సెలబ్రేషన్స్ లో భాగంగా గ్రౌండ్ లో నే మోకాళ్ళ మీద కూర్చొని నమాజ్ చేస్తారు. కానీ నిన్న ఆ ఛాన్స్ లేకపోయింది.
Advertisement
Advertisement
అవుట్ అయ్యాక పెవిలియన్ కు వెళ్తుంటే భారత్ ఫ్యాన్స్ రిజ్వాన్ ను మాక్ చేశారు. రిజ్వాన్ వెళ్తుంటే జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీన్ని కొంతమంది తప్పు పడుతున్నారు. ఇది క్రీడా స్ఫూర్తి కాదని అంటున్నారు. కానీ చాలామంది దీనిని సమర్థిస్తున్నారు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అయ్యాక బాబ్ కౌన్ హై అని పాక్ ఫ్యాన్స్ అన్నమాట గుర్తులేదా అని రిటర్న్ కౌంటర్ ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- Rohit Sharma : తన కండలతో ఎంపైర్ ను బెదిరించిన రోహిత్ శర్మ !
- ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న అక్కినేని అఖిల్…!
- Mrunal Thakur : స్టార్ హీరోతో సీతా రామం బ్యూటీ డేటింగ్.. అతడెవరంటే?