తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవలే రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. జైలర్ కంటే ముందు కబాలి, కాలా, దర్భార్, పెద్దన్న వంటి సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో రజినీ సినిమాలపై ప్రేక్షకులకు అంతగా ఆసక్తి లేకుండా పోయింది. తాజాగా రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిది. ఈ సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్పాలి.
Advertisement
లాల్ సలామ్ మూవీ ఒకటి వచ్చిందనే విషయం కొంత మంది ప్రేక్షకులకు తెలియదంటే.. రజినీకాంత్ సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ వస్తుందంటే.. తమిళ, తెలుగు రాష్ట్రాల్లో ఓ పండుగ వాతావరణం కనిపించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి పూర్తిగా విరుద్ధంగా మారిపోయింది. రజినీకాంత్ స్టామీనా కూడా తగ్గిపోవడంతో యంగ్ హీరోలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో సూపర్ స్టార్ హవా తగ్గిపోయిందనే చెప్పాలి. తెలుగులో అయితే రజినీకాంత్ మార్కెట్ రోజు రోజుకు తగ్గిపోతుంది. ఈ లాల్ సలామ్ మూవీ కలెక్షన్లు చూస్తే ఇది వాస్తవమే అనిపిస్తోంది.
Advertisement
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బయోపిక్ గా తెరకెక్కిన యాత్ర 2 మూవీ సాధించిన కలెక్షన్లను కూడా లాల్ సలామ్ సాధించలేకపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.5కోట్లు సాధించి రజినీకాంత్ కెరీర్ లోనే అతి తక్కువ వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా కంటే యాత్ర 2 మూవీకే ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. జగన్ బయోపిక్ కి తొలిరోజు రూ.5.5 కోట్లు వచ్చినట్టు సమాచారం. రజినీకాంత్ లాల్ సలామ్ సినిమా కంటే జగన్ బయోపిక్ కే ఎక్కువగా కలెక్షన్లు రావడం విశేషం. దీంతో బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జగన్ బయోపిక్ షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు.
Also Read : చైతన్య, సాయి పల్లవి రీల్.. సోషల్ మీడియాలో వైరల్!