Home » జబర్దస్త్‌ ఫైమా, ప్రవీణ్‌ విడిపోవడానికి మతమే కారణమా..?

జబర్దస్త్‌ ఫైమా, ప్రవీణ్‌ విడిపోవడానికి మతమే కారణమా..?

by Azhar
Published: Last Updated on
Ad

2013 లో ఎటువంటి అందనలు లేకుండా ప్రారంభమైన జబర్దస్త్ అనే ప్రోగ్రాం ఇప్పుడు.. టీవీలో అన్ని షోల కంటే పెద్ద షోగా అవతరించి భారీ సక్సెస్ సాధించింది. అయితే ఈ షో సక్సెస్ లో కామెడీతో పటుఫా ప్రేమ అనేది కూడా కొంచెం పాలుపంచుకుంది. మొదట్లో ఈ షోలో కేవలం సుధీర్, రష్మీ జోడి మాత్రమే ఉండేది. కానీ ఆ తర్వాత చాలా జోడీలు వచ్చాయి. అయితే ఆ జోడిలలో ఉండేవారు మొదట్లో నిజంగానే ప్రేమించుకుంటున్నారు అనుకున్న అభిమానులకు.. తర్వాత మెల్లిగా అది కేవలం కంటెంట్ కోసం మాత్రమే అని తెలిసింది.

Advertisement

అయితే ఇలా జబర్దస్త్‌ లో పుట్టిన జంటలలో ఫైమా, ప్రవీణ్‌ జంట కూడా ఒక్కటి. ఈ ఇద్దరు తమ డైలాగ్ డెలివరీలతో జబర్దస్త్‌ లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వీరు ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రవీణ్‌ కూడా చాలాసార్లు నేను ఫైమాను ప్రేమిస్తున్నాను.. పెళ్లి కూడా చేసుకుంటాను అని కామెంట్స్ చేయడం.. దానికి ఫైమా సైలెంట్ గా సిగ్గు పడుతుండటంతో ఈ జంట మాత్రం నిజమే అని అనుకున్నారు ఫ్యాన్స్.

Advertisement

ఇక తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే.. వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారు. కానీ ఇప్పుడు విడిపోయారు అని తెలుస్తుంది. ఈ మధ్య ఒక ఎపిసోడ్‌ లో ప్రవీణ్… ప్రేమ పేరుతో మూడు ఏళ్ళు ఆమె వెంట తిరిగితే చివరకు నన్ను వదిలేసింది అంటూ ఓ డైలాగ్‌ చెప్పాడు. ఇది ఫైమా కోసమే చెప్పాడు అని తెలుస్తుంది. ఇక చాలా రోజులుగా వీరిద్దరూ కలిసి ఒక్క స్కిట్ లో చేయడం లేదు. అది ఈ వార్తలు బలాన్ని ఇచ్చాయి. అయితే వీరు ఇద్దరు విడిపోవడానికి మతమే కారణం అని తెలుస్తుంది. ఫైమా, ప్రవీణ్‌ ఇద్దరు వేరు వేరు మతాలకు చెందినవారు కావడంతో.. రెండు కుటుంబాలు ఒప్పుకోలేదని.. అందుకే వీరు విడిపోయారు అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐకి ఎదురు తిరుగుతున్న కస్టమర్లు…!

ఐపీఎల్ 2022 లో వింత సమస్య… కరెంట్ లేక చెన్నైకి నష్టం..!

Visitors Are Also Reading