Home » ఆ బ్రదర్ ని బావ అని పిలవడం చాలా కష్టంగా ఉండేది.. విష్ణుప్రియ కామెంట్స్ వైరల్..!

ఆ బ్రదర్ ని బావ అని పిలవడం చాలా కష్టంగా ఉండేది.. విష్ణుప్రియ కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

సీరియల్ నటి విష్ణుప్రియ గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. కానీ జానకీ కలగనలేదు సీరియల్ లో మల్లిక అంటే మాత్రం అందరూ ఠక్కున గుర్తు పడుతారు. ప్రస్తుతం ఈమె పలు షోలు, సీరియల్స్ తో బిజీ లైఫ్ లీడ్ చేస్తున్న విష్ణుప్రియ.. అప్పట్లో సీరియల్ నటుడు సిద్దార్థ్ వర్మని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

ఫస్ట్ టైమ్ మా ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ వచ్చినప్పుడు తినడానికి తిండి కూడా లేదు. ఇల్లు చూడమని ఎవ్వరికో డబ్బులు ఇస్తే.. అతను కనిపించకుండా పోయాడు. డబ్బులు లేక ఆ రెండు రోజులు బస్టాండ్ లోనే ఉన్నాం. మా తల్లిదండ్రుల సపోర్ట్ తో ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. కానీ వాళ్లు మాత్రం లేరు. ఇక సీరియల్ నటుడు అమర్ దీప్ గురించి ప్రశ్నించగా.. అమర్ నా కంటే వయస్సులో పెద్ద. కానీ నన్ను అక్క అని పిలుస్తాడు. నేను కూడా వాడిని తమ్ముడులాగే చూసుకుంటాను. తన పెళ్లి కార్డు కూడా తొలుత నాకే ఇచ్చాడు. వాడి పెళ్లి పనులు నేను దగ్గరుండి చూసుకున్నాను.

Advertisement

కానీ జానకి కలగనలేను సీరియల్ లో మాత్రం అమర్ ని బావగారు అని పిలవాల్సి వచ్చింది. బ్రదర్ గా ఉండే అతను నాకు బావ అయ్యేసరికి అలా పిలవడం చాలా కష్టం అనిపించేది. అమర్ చాలా కష్టపడుతాడు. నా లైఫ్ లో బెస్ట్ అమర్. దేవుడు ఇచ్చిన తమ్ముడు అంటూ చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. ప్రస్తుతం విష్ణు ప్రియ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading