Home » సోషల్ మీడియా ఓపెన్ చేద్దామంటే భయమేస్తుంది.. హీరో సిద్దార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సోషల్ మీడియా ఓపెన్ చేద్దామంటే భయమేస్తుంది.. హీరో సిద్దార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Anji
Ad

 సాధారణంగా ఈ మధ్య కాలంలో  ఇటీవలే కాలంలో హీరో సిద్ధార్థ్ ఏం మాట్లాడినా.. ఏం చేసినా కానీ న్యూస్ అవ్వడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. ఒకప్పుడు స్టార్ హీరోగా తెలుగు, తమిళ్, హిందీ భాషలలో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సిద్ధార్థ ప్రస్తుతం సినిమా ఆఫర్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. అయితే దీనికి కారణం సిద్ధార్థ ఎంచుకున్న సినిమాలే అయినప్పటికీ ఒక స్టార్ హీరోకు అవకాశాలు లేని ఇలాంటి ఒక పరిస్థితి రావడం అందరినీ ఒకింత బాధకు గురి చేస్తుందనే చెప్పాలి.


ఇక లేటెస్ట్ గా సిద్ధార్థ చిన్న అనే సినిమాలో నటించారు. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచి ఫిలిం ఆఫ్ ది ఇయర్ అని గుర్తింపు పొందిన ఈ సినిమా తెలుగులో ఇటీవలనే రిలీజ్ అయిన చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ చిన్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సోషల్ మీడియా గురించి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సోషల్ మీడియా అంటేనే తనకు చాలా భయం వేస్తుందని చెప్పిన సిద్ధార్థ తన బాగా బాదించిన ఒక విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Advertisement

Advertisement

సిద్ధార్థ్ ఫ్రెండ్ ఎవరో చనిపోతే ఆ కార్యక్రమానికి వెళ్లిన సిద్ధార్థ్ ను అక్కడ పలు మీడియా ఛానల్స్ వాళ్ళు తనను చాలా ఇబ్బంది పెట్టారట. తన ఫ్రెండ్ చనిపోయాడని బాధలో ఉన్నా కూడా వాళ్లకు ఫోటో కావాలని అడిగారట. దాంతో ఆయన తన బాధను కవర్ చేసుకోవడానికి సన్ గ్లాసెస్ పెట్టుకుంటే వాటిని కూడా ఫోటోలు తీసి, సోషల్ మీడియాలో పెట్టి చనిపోయిన దగ్గర కూడా సిద్ధార్థ్ స్టైల్ గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడని రాశారంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇలాంటి వాళ్లకి నేనేమని సమాధానం చెప్పగలను. న్యూస్ ఒకటి జరిగితే, వాళ్ల ఎంటర్టైన్మెంట్ కోసం ఆ న్యూస్ ను మరో విధంగా రాస్తారు. అందుకే సోషల్ మీడియా అంటే తనకు చాలా భయం అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు: 

పూజా హెగ్దేను నమ్మించి మోసం చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

సుమ కొడుకు సినిమాకి టైటిల్ ప్రకటించిన రాజమౌళి.. మూవీ పేరు ఏంటంటే ?

Visitors Are Also Reading