Home » అంత్యక్రియల్లో చితికి నిప్పంటించిన వ్యక్తి వెనక్కి చూడకూడదంటారు..ఎందుకు..!!

అంత్యక్రియల్లో చితికి నిప్పంటించిన వ్యక్తి వెనక్కి చూడకూడదంటారు..ఎందుకు..!!

by Sravanthi
Ad

మన భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ పుట్టినప్పటినుంచి చచ్చేవరకు ఏ పని చేయాలన్నా దానికో సపరేట్ సాంప్రదాయం ఉంటుంది. ఈ సాంప్రదాయాన్ని పూర్వకాలం నుంచి మన పెద్దలు పాటిస్తూ వస్తున్నారు, వాటిని మనం కూడా ముందుకు తీసుకెళుతున్నాం. అలాంటి సాంప్రదాయ ఆచారాల్లో చావు తంతు కూడా ఒకటి.. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తిని ఊరేగింపుగా తీసుకెళ్లి చితిపై పడుకోబెట్టిన తర్వాత, తలకొరివి పెట్టి ఆ చితికి నిప్పంటించి వెనక్కి చూడకూడదు అంటారు. అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

అంత్యక్రియల్లో సంస్కృతి సాంప్రదాయాలు ఒక్కో ప్రదేశంలో ఒక్కో తీరుగా ఉంటాయి. ఈ సాంప్రదాయాలు పాటిస్తేనే చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుందని పెద్దవారు అంటుంటారు. అలా చనిపోయిన వ్యక్తిని చితిపై పడుకోబెట్టి, తలకొరివి పెట్టే వ్యక్తి కుండతో చుట్టూ తిరిగిన తర్వాత, చితికి నిప్పంటించి ముందుకు కదులుతారు. మళ్లీ వెనక్కి అస్సలు చూడరు..

Advertisement

గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి అంత్యక్రియల నుంచి తిరిగి వస్తున్నప్పుడు పొరపాటున కూడా వెనక్కి చూడకూడదట. అలా చూస్తే మరణించిన వ్యక్తి ఆత్మ చూసే వారితో ప్రేమలో పడుతుంది. తన నిష్క్రమణ కారణంగా ఆ వ్యక్తి మాత్రమే విచారంగా ఉన్నాడని భావిస్తుందట. అందువల్ల ఆత్మ శాంతిని పొందదు. ఆ వ్యక్తితో అనుబంధాన్ని పెంచుకుంటుంది. ఆ వ్యక్తి ఇంటికి రావాలని కోరుకుంటుందట. అందుకే అంత్యక్రియల తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదని పండితులు చెబుతుంటారు.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading