Home » కాజల్ వ్యవహారాలన్నీ చూసుకునేది ఆమె భర్త కాదట.. ఎవరంటే..?

కాజల్ వ్యవహారాలన్నీ చూసుకునేది ఆమె భర్త కాదట.. ఎవరంటే..?

by Anji

టాలీవుడ్ లో దాదాపుగా దశాబ్దం కాలం పాటు అగ్ర హీరోయిన్ గా కొనసాగారు కాజల్ అగర్వాల్. అగ్ర హీరోలకు జోడిగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రెండేళ్ల కిందట ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు. ఇక అప్పటినుంచి కాజలు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తెరపై కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. తన సినిమా వ్యవహారాలు ఎవరు చూస్తారు అనే విషయము ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

 

తన కెరీర్ ప్రారంభం నుంచి కూడా సినిమా, వ్యాపార రంగ విషయాలన్నీ వాళ్ల అమ్మనే చూసుకుంటుందని చెప్పుకొచ్చింది కాజల్. తన తల్లి కూడా వ్యాపారం చేస్తుందని వెల్లడించింది. కాజల్ తన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంతు కేసరి మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావు పూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తో పాటు కమలహాసన్ భారతీయుడు 2 సినిమాలో కూడా నటిస్తోంది కాజల్.

చాలా కాలం పాటు గ్యాప్ ఇచ్చిన కాజల్.. పెళ్లి తరువాత ఇద్దరు సీనియర్ హీరోలతో నటిస్తోంది. అనిల్ రావు పూడి తెరకెక్కించే బాలయ్య మూవీ భగవంతు కేసరి అక్టోబర్ 19న దసరా కానుక ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్ హాసన్ హీరోగా నటించే భారతీయుడు చిత్రం విడుదల తేదీ మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కోలీవుడ్ ట్రేడ్ వర్గాల ప్రకారం.. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినప్పటికీ ఈ చిత్రానికి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ పనులు చాలా బ్యాలెన్స్ ఉన్నట్టు సమాచారం. అందుకే భారతీయుడు మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోకి వాయిదా వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తే కానీ ఓ క్లారిటీ రాదు. కాజల్ నటించే ఈ రెండు సినిమాలు మరి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి మరి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అతనితో నాకు పెళ్లి జరుగలేదు.. వనిత విజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

 నందమూరి హీరోలు కాకుండా నారా బ్రాహ్మణికి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading