సాధారణంగా స్టార్ హీరోలు తమ జీవితకాలంలో 50 సినిమాలు చేస్తే గ్రేట్ అనే పరిస్థితి నెలకొంది. స్టార్ హీరోలు ఒక్కో సినిమాకి రెండు నుంచి మూడేళ్ల సమయం కేటాయిస్తుండటంతో ప్రతీ యంగ్ జనరేషన్ స్టార్ హీరో ఐదేళ్లలో కేవలం రెండు లేదా మూవీ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. సినిమాల్లో ఎంత వేగంగా నటించినా హీరోలు ఏడాదికి ఒక సినిమాని రిలీజ్ చేయడం సాధ్యం కావడం లేదు. ఈ జనరేషన్ 150 కి పైగా సినిమాల్లో నటించిన హీరో చిరంజీవి కాగా.. ఈ రికార్డు బ్రేక్ కావడం సాధ్యం కాదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తున్న వాళ్లు ఎవ్వరూ కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేరు అనే చెప్పవచ్చు. చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించడం వల్లనే ఈ రికార్డు సాధ్యమైంది. అప్పట్లో హీరోలు నెలకు ఒక సినిమాని షూటింగ్ కంప్లీట్ చేసే వారు. అప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉండగా.. ఈ సినిమా కోసం చిరంజీవి కష్టపడుతున్నారు. చిరంజీవి 60 నుంచి రూ.100కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని అందుకుంటూ అభిమానులకు చాలా దగ్గరవుతున్నారు.
Advertisement
Advertisement
కెరీర్ పరంగా చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి నెక్ట్స్ లెవెల్ సినిమాలతో ఈ జనరేషన్ ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వాలని భావిస్తుండటం గమనార్హం. చిరంజీవి ఇతర భాషలపై కూడా దృష్టి పెడుతుండగా.. మెగాస్టార్ సినిమాకి సక్సెస్ వస్తే.. ఇతర భాషల్లో సైతం చిరంజీవి కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. యంగ్ జనరేషన్ హీరోలకు సైతం చిరంజీవి తన సినిమాల్లో ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఫ్యాన్స్ కి మరింత దగ్గరవుతున్నారు.
Also Read : తండ్రైన శర్వానంద్.. ఆలస్యంగా కూతురి ఫోటో షేర్ చేసిన హీరో.. ఏం పేరు పెట్టారంటే..?