తెలుగు ఇండస్ట్రీని తారా స్థాయికి తీసుకెళ్లిన అలనాటి మేటినటుల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. ఆయన నటుడిగా తెలుగు వారి గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపుగా 300 చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన సినిమాల్లో చేయని పాత్ర అంటూ లేదు. ఏ పాత్రలోనైనా ఇట్టే దూరిపోయే వ్యక్తిత్వం కల హీరో ఎన్టీఆర్.. అలాంటి ఎన్టీఆర్ అందాల భామ అతిలోక సుందరి శ్రీదేవి తో చాలాసార్లు జతకట్టారు. వెండితెర మీద ఎంట్రీ ఇచ్చి శ్రీదేవి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
Advertisement
also read;శ్రీకాంత్ ఊహ ల అందమైన లవ్ స్టోరీ గురించి మీకు తెలియని విషయాలు !
శ్రీదేవి ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే. అలాంటి ఎన్టీఆర్ ఆ ఒక్క సినిమాలో మాత్రం శ్రీదేవిని పక్కన పెట్టేశారు. ఆమెతో సినిమా వద్దంటే వద్దన్నారు. అది ఎన్టీఆర్ కెరియర్ లో సూపర్ హిట్ అయిన సినిమా ఆరాధన. ఈ సినిమా కథపరంగాను పాటల పరంగానూ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో పాటలు పాడాల్సింది స్టార్ సింగర్ బాలసుబ్రమణ్యం. ఇదే తరుణంలో ఎన్టీఆర్ కు మరియు బాలు గారికి చిన్న విభేదం రావడం వల్ల బాలు ప్లేసులో హిందీ సింగర్ మహమ్మద్ రఫీ తో పాటలు పాడించారు.
Advertisement
ఈ విధంగానే హీరోయిన్స్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ముందుగా ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్ అనుకున్నారట.కానీ కుదరకపోవడంతో, ఎన్టీఆర్ శ్రీదేవి జంటగా అనుకున్నారు. కానీ ఇంతలోనే ఎన్టీఆర్ మాత్రం శ్రీదేవిని వద్దని వాణిశ్రీని ఎంపిక చేశారు. ఎందుకంటే గత సినిమాలో వాణిశ్రీ నటన చూసిన ఎన్టీఆర్, ఈ పాత్రకు ఆమె అయితేనే సెట్ అవుతుందని చెప్పారట. దీంతో శ్రీదేవిని పక్కన పెట్టి ఎన్టీఆర్ వాణిశ్రీ తో జత కట్టారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా వీరిద్దరి జంట అభిమానులకు ఎంతో దగ్గరయింది.
also read;సినిమా సరిగ్గా తీయ్యకుంటే ఛస్తావ్ అంటూ ఉత్తరాలతో బెదిరించింది ఆ స్టార్ హీరో ఫాన్స్ ?