Home » చర్మం ముడతలు పడుతోందా.. ఈ పండ్లతో చెక్ పెట్టండి..!!

చర్మం ముడతలు పడుతోందా.. ఈ పండ్లతో చెక్ పెట్టండి..!!

by Sravanthi
Ad

ప్రస్తుత కాలంలో చాలామంది 35 సంవత్సరాలు దాటితే చాలు చర్మం ముడతలు పడి వికారంగా కనిపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహార పదార్థాలు. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలామంది ఫేషియల్ క్రీములు, ఇతరాత్రా క్రిముల ద్వారా ముడతలు తగ్గిస్తున్నారు. ముఖ్యంగా చర్మం నున్నగా మెరిసేలా చేసుకోవాలని అనుకునేవారు ఈ పండ్లు తినాలి..

దానిమ్మ: దీనిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. అంతేకాకుండా కొల్లాజన్ ఉత్పత్తిని పెంచేందుకు దానిమ్మ ఎంతో సాయపడుతుంది.

Advertisement

బ్లూ బెర్రీ :
ఎంత వయసు వచ్చినా యవ్వనంగా కనిపించడానికి ఉపయోగపడే పండ్లలో బ్లూ వెర్రి ముఖ్యమైనది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ చర్మ ముడతలు పడకుండా చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మళ్లీ కాపాడుతుంది.

Advertisement

స్ట్రాబెరీలు :
స్ట్రాబెర్రీలు కూడా చర్మ ముడతలు పడకుండా చేసే పండలో ఒకటి. ఇందులో ఉండే విటమిన్ సి చర్మ ముడతలు పడకుండా ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పుచ్చకాయ కూడా చర్మం ముడతలు పడకుండా కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading