సాధారణంగా మనం వంట చేయాలంటే అందులో కచ్చితంగా ఉపయోగించే పదార్థం కారం ఒకటి. కారం లేకుండా ఏ కూర కూడా చేయలేము. ఎండు మిరపకాయలతో తయారు చేసే ఈ కారం పొడిని దాదాపు ప్రతీ వంటకంలో ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్ లో లభించే కారం పొడుల్లో కల్తీ ఉంటుందనే విషయం మీరు గమనించారా..? మీ కారం కల్తీనా కాదా అని ఎలా తెలుసుకోవాలని ఇప్పుడు మనం చూద్దాం.
Advertisement
ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టువంటి ఎర్రకారం ప్యాకెట్లన్నింటిలో ఇటుక పొడి, టాల్కం పౌడర్ ఇతర విషపూరిత పదార్థాలు కలిసిపోయి ఉంటాయి. ఇటువంటి ఉత్పత్తులను కంటితో చూసి వెంటనే కల్తీని కనుక్కోలేం. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యానికి తీరని నష్టం కలుగుతుంది. అందుకే మీరు వాడుతున్న మిరపపొడి స్వచ్ఛమైనదా..? కాదా అనే విషయం నిర్ధారించుకోవడం చాలా అవసరం.
Advertisement
ఇది కూడా చదవండి : ఈ 3 లక్షణాలు ఉన్న పురుషులను..మహిళలు చాలా ఇష్టపడతారట.. ఇందులో 2వది ఇంపార్టెంట్..!!
తాజాగా FSSAI కారంపొడి స్వచ్ఛతను తనిఖీ చేసే విధానం గురించి ట్విట్టర్ లో ఓ వీడియోను షేర్ చేసింది. ముఖ్యంగా గ్లాస్ అడుగు భాగానికి చేరిన కారం పొడిని తీసుకొని అరచేతిపై మృదువుగా రుద్దాలి. చేతికి గరుకుగా అనిపిస్తే అందులో ఇసుక లేదా ఇటుక పొడి కలిపినట్టు అర్థం. కల్తీలేని కారం పొడి సాధారణంగా నీటిలో కరుగుతుంది. కారం కరగలేదంటే ఆ కారం పొడిలో సబ్బు పొడి లేదా డిటర్జెంట్ పౌడర్ కలిపినట్టు అర్థం చేసుకోవాలి. ఇలాంటి కారం పొడిని మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఉపయోగిస్తే చాలా ప్రమాదమే.
ఇది కూడా చదవండి : పెరుగు, మజ్జిగ రెండింటిలో ఏది బెస్ట్.. వాటి ప్రయోజనాలు తెలిస్తే వదలరు..!