Home » ఆహుతి ప్రసాద్ నాన్న చనిపోవడానికి అసలు కారణం అదేనా..?

ఆహుతి ప్రసాద్ నాన్న చనిపోవడానికి అసలు కారణం అదేనా..?

by Anji
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని విలన్ గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న దివంగత నటుడు ఆహుతి ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల సక్సెస్ లో కీలకపాత్ర పోషించిన ఆయన ఊహించని విధంగా మరణించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపోతే తాజాగా ఆయన కొడుకు కార్తీక్..  తన నాన్న చనిపోవడానికి గల అసలు కారణాన్ని వెల్లడించారు.

Advertisement

పెళ్లి అయ్యాక నాన్న మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి సినిమాల్లోకి వచ్చారు. ఆహుతి సినిమాలో ఆయన నటించారు.. ఇక ఆ సినిమా ద్వారా మంచి పేరు లభించడంతో ఆ పేరుని ఇంటిపేరుగా మార్చుకున్నారు. అలా మొత్తం 300 సినిమాలలో నాన్న నటించడం జరిగింది. హీరోయిన్ ఫాదర్ రోల్స్ లో ఎక్కువగా చేశారు. అంతే కాదు కొన్ని సినిమాలలో విలన్ రోల్స్ కూడా చేశారు. స్కూల్ డేస్ సమయంలో మేము చెన్నైలో ఉండే వాళ్ళం. ఆ తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాము ఒక సినిమాకు నిర్మాతగా చేసి నాన్న డబ్బులు అన్ని పోగొట్టుకున్నారు అంటూ కామెంట్లు చేశారు కార్తీక్. నాగార్జున నటించిన నిన్నే పెళ్ళాడతా సినిమా తర్వాత నాన్నకు వరుసగా ఆఫర్లు వచ్చాయి . ఇక నాన్న చనిపోయిన కూడా నాన్నను ఊహించుకొని పాత్రలు రాస్తున్నామని చాలామంది చెబుతున్నారు అంటూ తెలిపారు కార్తీక్.

Advertisement

నాన్న అరుపుకి చాలా భయపడే వాళ్ళము. ముఖ్యంగా అన్నయ్యకు చదువు విషయంలో నాన్న సూచనలు ఇచ్చేవారు అంటూ కార్తీక్ చెప్పుకొచ్చారు. షూటింగ్ లేకపోతే నాన్న కార్డ్స్ ఆడే వారని.. అంతేకాదు రియల్ ఎస్టేట్ కూడా చేశారు అని ఆయన తెలిపారు. నాన్న బ్రతికి ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవారు. క్యాన్సర్ వచ్చాక కూడా నాన్న సినిమాలలో కొనసాగారు. అయితే ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత కూడా 20 సినిమాలలో నటించారు. ఆ మహమ్మారి కారణంగానే నాన్న మన మధ్య లేకుండా పోయారు అంటూ ఎమోషనల్ అయ్యారు కార్తీక్. ఇకపోతే తన తండ్రి గురించి కార్తీక్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఇంత గొప్ప నటుడు మహమ్మారి బారిన పడి మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.

Visitors Are Also Reading