Rangasthalam Movie: చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్. చిరుత సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేదు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మగధీర సినిమాతో స్టార్ హీరోగా మారిపోయారు. అయితే ఆ తరవాత ఎన్నో సినిమాలు చేసినా నటన పరంగా మాత్రం రామ్ చరణ్ గుర్తింపు సాధించలేక పోయారు.
Advertisement
కొంతమంది రామ్ చరణ్ కు అసలు నటన రాదని హావభావాలు పలికించ లేరని విమర్శించారు. అయితే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. చెవిటి తనం ఉన్న వ్యక్తిగా రామ్ చరణ్ నటించారు. ఈ సినిమాలో చరణ్ నటించాడు అని చెప్పే కంటే జీవించేశాడు అనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో సమంత నటన కూడా అద్భుతంగా ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Advertisement
అయితే ఈ సినిమా అచ్చం చిరంజీవి హీరోగా నటించిన జాతర సినిమా మాదిరిగా ఉందని ఆ సినిమా దర్శకుడు ధవళ సత్యం ఓ ఇంటర్వ్యూలో అన్నారు. తనకు ఈ సినిమా చూడాలని అల్లు అరవింద్ చెప్పారని తెలిపారు. దాంతో రంగస్థలం సినిమా చూశానని అయితే ఈ చిత్రం తాను తీసిన జాతర సినిమాను పోలి ఉందని చెప్పారు. చిరంజీవి హీరోగా సౌమ్య సినీ ఆర్ట్స్ బ్యానర్ పై ధవళ సత్యం తీసిన జాతర సినిమాలో ఇంద్రాణి హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాలో చిరంజీవికి అన్నగా శ్రీధర్ నటించగా సువర్ణ ముఖ్య పాత్రలో నటించింది. ఈ చిత్రంలో కూడా ప్రెసిడెంట్ ప్రతి పనికి ముందు అమ్మవారికి పూజలు చేస్తాడు అని తెలిపారు. పేద ప్రజల నుండి అధిక వడ్డీలు వసూలు చేస్తారని చివరకు ఊరు ప్రజలంతా ప్రెసిడెంటును తరిమి కొడతారని తెలిపారు. రంగస్థలం సినిమా లో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయని చెప్పారు. దాంతో సుకుమార్ జాతర సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకునే రంగస్థలం కథను రాసుకుని ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Also read :
టాలీవుడ్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ లుగా నిలిచిన 5 సీక్సెల్స్ ఇవే..!
వైఎస్ఆర్ నిజంగా ఆ డైలాగ్ చెప్పాడా…? పరుశురామ్ కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్…!