Home » సమంత విషయంలో అక్కినేని ఫ్యామిలీ చేసిన తప్పు.. ఇప్పుడు లావణ్య విషయంలో మెగా ఫ్యామిలీ చేస్తుందా ?

సమంత విషయంలో అక్కినేని ఫ్యామిలీ చేసిన తప్పు.. ఇప్పుడు లావణ్య విషయంలో మెగా ఫ్యామిలీ చేస్తుందా ?

by Anji
Ad

టాలీవుడ్ హీరో సీనియర్ హీరో  అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈయన రెండో సినిమా ఏమాయ చేశావే సినిమా సమయంలో స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డాడు. పెద్దల సమక్షంలో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. మనస్పార్థాల కారణంగా సమంత-చైతన్య నాలుగేళ్లు గడవక ముందే విడాకులు తీసుకున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే.

Advertisement

ఇదిలా ఉంటే.. హీరోయిన్ సమంత విషయంలో  అక్కనేని వారి ఫ్యామిలీ చేసిన తప్పే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి విషయంలో మెగా ఫ్యామిలీ చేస్తుందంటూ.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత-నాగచైతన్య పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలు చేయాలనే ఆలోచన లేదు. ప్రేమించిన వాడితో హ్యాపీగా ఉంటే.. చాలు అని అనుకుంది. కానీ నాగార్జున ఫ్యామిలీ కూడా ఎలాంటి కండిషన్లు పెట్టలేదట. కానీ దర్శకులు సమంత వద్దకు రావడం.. అవకాశాలు ఇవ్వడంతో అక్కినేని ఫ్యామిలీ కూడా అడ్డు చెప్పకపోవడంతో సమంత కాస్త లిమిట్స్ దాటిందట. దీంతో ఫైనల్ గా డివోర్సు తీసుకునేంత వరకు వెళ్లినట్టు సమాచారం.

Advertisement

ప్రస్తుతం హీరోయిన్ లావణ్య త్రిపాఠికి కూడా మెగా ఫ్యామిలీ ఎలాంటి కండిషన్స్ పెట్టలేదట. ఈ తరుణంలో దర్శకులు కూడా లావణ్యతో సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవేళ ఈ స్ట్రాటజీ మాత్రం కాస్త అటు, ఇటుగా మారితే మాత్రం లావణ్య తీసుకునే నిర్ణయం పరిశ్రమలో చాలా కీలకంగా మారబోతుందంటూ సినీ విశ్లేషకులు చర్చించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరికొందరూ మాత్రం మెగాస్టార్ ఫ్యామిలీ అలా ఏం చేయదని.. ఇప్పటికే చిరంజీవి కూతురు రెండుసార్లు విడాకులు తీసుకుంది. మరోవైపు నాగబాబు కూతురు నిహారిక కూడా విడాకులు ప్రకటించింది.  ఈ తరుణంలోనే లావణ్య  గురించి రకరకాల వార్తలు విపిస్తున్నాయి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి!  తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading