ప్రపంచంలో ప్రతి ఒక్కరికి క్రికెట్ అంటే ఎంతో ప్రేమ. కొంతమందికి ఆడడం ఇష్టం. మరికొందరికి చూడడం అంటే ఇష్టం. టీవీల్లో క్రికెట్ వస్తుందంటే ప్రతి ఒక్క అభిమాని టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక క్రికెట్ ఆడుతున్న సమయంలో ప్లేయర్స్ అందరూ బ్రేక్ సమయంలో కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వంటివి చేస్తూ ఉంటారు. ఇక మరి క్రికెట్ ఆడుతున్న సమయంలో ప్లేయర్ కి టాయిలెట్ వస్తే ఏం చేస్తాడు అనే డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది.
క్రికెట్ ఆడుతున్నప్పుడు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వారికీ టాయిలెట్ వచ్చినట్లయితే మరో ప్లేయర్ ని వారి స్థానంలో పెట్టి వారు టాయిలెట్ కి వెళ్లివస్తారు. అలా కాకుండా బ్యాట్స్మెన్ కి టాయిలెట్ వస్తే వారు ఎంపైర్ కి చెప్పి వెళ్లడం జరుగుతుంది. ఇక వారు వచ్చేవరకు ఎంపైర్ అందరికీ డ్రింక్స్ బ్రేక్ ని ఇస్తాడు. ఇక ఇదంతా జరుగుతున్న సమయంలో మనకు చూపించరు. అలాంటి సమయంలో మనకు బ్రేక్ ని ఇస్తారు. టీవీ చూసేవాళ్లకు దీని గురించి తెలియదు. కేవలం స్టేడియంలో మ్యాచ్ చూసే వాళ్లకి మాత్రమే ఇది తెలుస్తుంది.
Advertisement
Advertisement
అయితే బ్యాట్స్మెన్ కి టాయిలెట్స్ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే వారు గ్రౌండ్లో రన్స్ కోసం ఎప్పుడు పరిగెత్తుతూ ఉంటారు. కాబట్టి వారు తీసుకునే డ్రింక్స్ అంతా చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ కడుపులో ఏదైనా ఇబ్బందిగా ఉండి టాయిలెట్ వస్తే తప్ప మామూలుగా అయితే వారు టాయిలెట్ కి వెళ్లరు. వారి శరీరంలో ఎక్కువ నీటిశాతం చెమట రూపంలో బయటకు వెళ్తుంది. అందువల్లనే వారు ఎక్కువగా టాయిలెట్ కి వెళ్లరు. ప్లేయర్స్ అందరూ కూడా ఆట సమయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కాబట్టి ఆట సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.
ఇవి కూడా చదవండి
- 16 ఏళ్లకే చనిపోతావని తెలిస్తే అలా చేసి ఉండేదాన్ని కాదు!.. మీరా మృతిపై విజయ్ భార్య ఎమోషనల్
- అమిత్ షాతో నారా లోకేష్ రహస్య మంతనాలు…బీజేపీలో టీడీపీ విలీనం కానుందా !?
- 3 ఏళ్లకు ఒకసారి పవన్ కళ్యాణ్ భార్యలను మారుస్తూ ఉంటాడు – జగన్