Home » చిరంజీవి ఇంట్లో చిత్రీకరించిన బాలకృష్ణ సినిమా అదేనా ?

చిరంజీవి ఇంట్లో చిత్రీకరించిన బాలకృష్ణ సినిమా అదేనా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణకి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీరిద్దరూ దాదాపు 40 ఏళ్లుగా బాక్సాఫీస్ వద్ద ఒకళ్ల సినిమాలతో మరొకరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో వీళ్లిద్దరి సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఢీ అంటే ఢీ అన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. సినీ ఇండస్ట్రీలో ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో బాలయ్య నటించిన ఓ సినిమా షూటింగ్ ని దాదాపు చిరంజీవి ఇంట్లోనే చేశారు. 

Advertisement

బాలయ్య హీరోగా నటించిన ఓ సినిమా షూటింగ్ దాదాపు చిరంజీవికి సంబంధించిన గెస్ట్ హౌస్ లో జరిగింది. ఈ మూవీ షూటింగ్ దాదాపు 33 ఏళ్లు కావస్తోంది. నారీ నారీ నడుమ మురారి సినిమా విడుదలై రీసెంట్ గా 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మూవీ బాలయ్య, ఏ.కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన ఏడో మూవీ. హీరోగా నందమూరి బాలకృష్ణకి 50వ సినిమా. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గరగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1988లో సెప్టెంబర్ లో యువ చిత్ర బ్యానర్ లో తెరకెక్కిన జానకీ రాముడు సినిమాకు కథకు అందించిన విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తతో కలిసి నారీ నారీ నడుమ మురారి సినిమాకి కథా చర్చలు ప్రారంభించారు నిర్మాత మురారి. తొలుత ఈ సినిమాలో హీరోయిన్స్ గా భాను ప్రియ చెల్లెలు శాంతి ప్రియతో పాటు సీతగా అనుకున్నారు. శాంతిప్రియ, సీత ప్లేస్ లో శోభన, నిరోషాలను హీరోయిన్స్ గా తీసుకున్నారు.

Advertisement

నారీ నారీ నడుమ మురారి హీరోగా బాలయ్య కెరీర్ లో ఈ మూవీకి ప్రత్యేక స్థానముంది. ఈ చిత్రం బాలయ్యను పూర్తి క్లాస్ గా చూపించింది. ఈ మూవీలో బాలయ్యకి ఒక్క ఫైట్ సీన్ లేకపోవడం విశేషం. డిసెంబర్ 03, 1989న సినిమా ప్రారంభం అయింది. ఈ సినిమాని చెన్నైలోని వెల్లిచ్చెరి ప్రాంతంలో చిరంజీవి గెస్ట్ హౌస్ లో చిత్రీకరించారు. దాని పేరు హనీ హౌస్. దాని పక్కనే ఉన్న రెండు ఎకరాల స్థలం కూడా చిరంజీవిదే. ఆ స్థానంలోనే నారీ నడుమ మురారి సినిమాకి సంబంధించిన 90 శాతం షూటింగ్ చేయడం విశేషం. ఈ మూవీలో అత్త, మామల ఇంటి పక్కనే ఉన్న పాకలోనే హీరో ఉంటూ అత్తను టీజ్ చేయడం అనేది ఈ మూవీ యొక్క ప్రత్యేకత. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు: 

పెళ్లి కాలేదు.. కానీ పిల్లాడున్నాడు.. ఆ బ్యూటీ కామెంట్స్ వైరల్.. !

సమంత-నాగచైతన్య విడిపోవడానికి కారణం ఈ దోషమేనా..? అలా చేస్తే వారు కలిసి ఉండేవారా ?

Visitors Are Also Reading