Home » సోనీకి కాదు మళ్ళీ స్టార్ స్పోర్ట్స్ కే మీడియా హక్కులు…!

సోనీకి కాదు మళ్ళీ స్టార్ స్పోర్ట్స్ కే మీడియా హక్కులు…!

by Azhar
Ad

ఐపీఎల్ సీజన్ 2023 – 2027 వరకు మీడియా ప్రసార హక్కుల వేలం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు మీడియా ప్రసార హక్కులు సోనీకి దక్కాయి అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అది తప్పుగా అని తెలుస్తుంది. మళ్ళీ ఈసారి కూడా ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ సొతం చేసుకుంది అని తెలుస్తుంది. అయితే మన ఇండియాలో టీవీ ప్రసార హక్కులు అయిన ప్యాకేజీ Aని స్టార్ స్పోర్ట్స్ 23,575కోట్లకు దక్కించుకుందని ఫైనల్ అయిపోయింది. దాంతో ఈ టీవీ ప్రసార హక్కుల ప్యాకేజీలో ఒక్కో మ్యాచ్‌కు 57.5కోట్లు బీసీసీఐకి వస్తున్నాయి.

Advertisement

ఇక ఆ తర్వాత డిజిటల్ ప్రసార హక్కులు అయిన ప్యాకేజి బిని వయాకామ్ సంస్థ రూ.20,500 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఈ లెక్క ప్రకారం ఒక్కో మ్యాచ్ డిజిటల్ ప్రసారానికి బీసీసీఐకి 50 కోట్లు రానున్నాయి. అయితే వయాకామ్ ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారానికి తనకు ఇప్పుడు ఉన్న voot యాప్ నే ఉపయోగిస్తుందా.. లేక కొత్త యాప్ ను తీసుకువస్తుందా అనేది తెలియదు. కానీ ఈ లెక్కల ప్రకారం చూస్తే ఈ రెండు ప్యాకేజీల ద్వారానే బీసీసీఐ ఖాతాలోకి ఒక్కో మ్యాచ్ కు 107.5 కోట్లు వచ్చిచేరుతున్నాయి.

Advertisement

అయితే ఈ బిడ్డింగ్ ప్రక్రియ అనేది ఇంకా ముగియలేదు. ప్యాకేజీ సి అంటే 18 ఎక్స్ క్లూజివ్ మ్యాచ్ ల హక్కులు అలాగే ప్యాకేజీ డీ అనగా విదేశాలలో టీవీలలో ఐపీఎల్ మ్యాచ్ ల ను ప్రసారం చేసే హక్కుల కోసం రేపు వేలం జరగనుంది. అయితే ప్రస్తుతం ప్యాకేజ్ సి వేలం 1813 కోట్ల దగ్గర ఉంది. మరి దీనితో పాటు డీ వేలం ఎక్కడికి వెళ్లి ముగుస్తుంది అనేది చూడాలి. అయితే ఇప్పటికే కేవలం రెండు ప్యాకేజీలతో బీసీసీఐకి 44,5075 కోట్లు రాగ… రేపు ఇంకా ఎన్ని వస్తాయి అనేది చూడాలి మరి.

ఇవి కూడా చదవండి :

రోహిత్, రాహుల్ పై ఓపెనర్ ఇషాన్ షాకింగ్ కామెంట్స్.. వారిని జట్టులో నుండి…

ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన శ్రీలంక..!

Visitors Are Also Reading