ఐపీఎల్ 2023 మార్చి 31న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇవాళ్టి వరకు ఐపీఎల్ మ్యాచ్ లన్నియూ చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇక ఇందులో ముంబై జట్టు ఆడిన మొదటి మ్యాచ్ ఓడిపోయింది. బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడింది ముంబై ఇండియన్స్. అయితే.. ఇప్పుడు ఐపీఎల్ చీర్ లీడర్స్ రెమ్యూనరేషన్ పై చర్చ జరుగుతోంది. ఐపీఎల్ లీడర్స్ ఒక్క మ్యాచ్ సగటున 12వేల నుంచి 17వేల వరకు ఫ్రాంచైజీలు చెల్లిస్తాయట.
read also : నందమూరి తారక రామారావు గారి పెద్ద కొడుకు రామకృష్ణ మరణానికి కారణం ఏంటి? చాలామందికి తెలియని విషయం!
Advertisement
ఇక క్రిక్ ఫాక్ట్స్ నివేదిక ప్రకారం కోల్కత్తా నైట్ రైడర్స్ తమ చీర్ లీడర్స్ కు అత్యధిక మొత్తం చెల్లిస్తున్నట్లు వెల్లడి అయింది. అత్యధికంగా ఒక్కో మ్యాచ్ కు రూ.24,000 పారితోషితంగా కేకేఆర్ అందిస్తుందట. ఇక చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లీడర్స్ కు మ్యాచ్ కు 12 వేల రూపాయల చొప్పున ఇస్తున్నట్టు సమాచారం. కాగా అపరకుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్ కు పనిచేస్తున్న చీర్ లీడర్స్‌కు ఒక్కో మ్యాచ్‌కు 20వేల రూపాయల చొప్పున ముట్టచెబుతున్నారట.
Advertisement
అదేవిధంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సైతం ముంబై మాదిరి 20,000 చెల్లిస్తోందట. ఇలా చీర్ లీడర్స్ ఒక్క మ్యాచ్ కు ఈ మేరకు నగదు అందుకోవడమే కాకుండా విలాసవంతమైన హోటళ్లలో బస, రుచికరమైన భోజనంతో ఇతర సదుపాయాలు కూడా పొందుతున్నారు. ఏంటి…ఇదంతా వింటుంటే చీర్ లీడర్స్ పనే బాగున్నట్టుంది అనుకుంటున్నారా? నిజానికి చీర్ లీడర్ గా ఎంపిక కావడం అంత తేలికేం కాదు. స్వతహాగా మంచి డాన్సర్లు అయిన వాళ్ళు, మోడలింగ్ రంగంలో ఉన్న వాళ్ళను… అనేక ఇంటర్వ్యూలు అనంతరం ఆయా ఫ్రాంచైజీలు సెలెక్ట్ చేస్తాయి. అంతేకాదు వేలాది ప్రేక్షకుల నడమ రాత్రి పగలు మ్యాచ్ అనే తేడా లేకుండా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది మరి!
READ ALSO : AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…