ప్రస్తుతం మనం ఆషాడమాసంలో ఉన్నాం. ఈ మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆషాడమాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. శూన్యమాసం అంటే శుభకార్యాలకు పనికిరాని మాసం అని అర్థం. అందువల్లే ఆషాడంలో ఎలాంటి శుభకార్యాలను జరిపించరు. పెళ్లి చూపులు కూడా ఈ మాసం లో జరగవు. అయితే ఈ మాసంలో ఓ ఆచారం మాత్రం చాలా ఫేమస్ అయ్యింది. అదే ఆషాడం లో అత్తా కోడళ్లు ఒకే ఇంట్లో ఉండకూడదు అని చెప్పడం.
Advertisement
ఈ ఆచారం మన పూర్వీకుల నుండి ఉంది. అయితే ఈ ఆచారం ఎందుకు వచ్చిందో ఇప్పడు తెలుసుకుందాం. ఆషాడమాసం ప్రారంభంలోనే వర్షాలు కురవడం మొదలవుతుంది. ఇక వర్షాలు కురిసే కాలం కాబట్టి రైతులు పంటలు వేయాల్సి ఉంటుంది. ఇక ఒకప్పుడు మన పూర్వీకులంతా వ్యవసాయం మీద ఆధారపడి జీవించినవారే.
Advertisement
కాబట్టి కొత్తగా పెళ్లైన భర్తలు భార్య వ్యామోహంలో పంటలను పట్టించుకోరు అనే భావనతో ఈ మాసం లో భార్యలను తల్లిగారి ఇంటికి పంపించడం మొదలైందని కొందరు పెద్దలు చెబుతుంటారు. ఇక మరికొందరు ఇంకో కారణం కూడా ఉందని చెబుతున్నారు. మరోవైపు ఆషాడంలో కొత్తగా పెళ్లైన భార్యా భర్తలు కలుసుకుంటే పుట్టబోయే మొదటి సంతానం సరైన గుణగణాలు ఉండవని కూడా చెబుతున్నారు.
పుట్టబోయే పిల్లలు భాగుండాలనే ప్రతిఒక్కరూ భావిస్తారు కాబట్టి ఆషాడంలో భార్య భర్తలు కలవకూడదు అనే సాంప్రదాయం వచ్చిందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ సాంప్రదాయలను పాటించేవారు మాత్రం చాలా తగ్గిపోయారు. బిజీ లైఫ్ స్టైల్ భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సి ఉండటం వల్ల పట్టించుకోవడం లేదు.
ALSO READ : డార్లింగ్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?