హిట్, సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ ….ఇవి సినిమాల క్యాలిబర్ ను కొలిచే లెక్కలు! అప్పటి వరకు ఉన్న అన్ని సినిమాలకంటే ఎక్కువ కలెక్షన్ రాబట్టిన సినిమాను ఇండస్ట్రీ హిట్ అంటారు. 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన సినిమాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం!
Advertisement
- Baahubali: The Conclusion ( 2017)
309.70 Cr
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలనం విజయం సాధించడమే కాదు. భారత చలన చిత్రానికి కొత్త లెక్కలను చూపించింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో భారతీయ సినిమా సత్తా ఏమిటో చూపించింది. ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసుకునే విధంగా అన్ని ఇండస్ట్రీలలో జెండా పాతేసిం బాహుబలి ది కన్‌క్లూజన్. ఇప్పటికీ బాహుబలి రికార్డులు అలాగే ఉన్నాయి.
- Baahubali : The Beginning ( 2015)
184.61 Cr
2015లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్ తోనే రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ సినిమా 184.61 కోట్లను వసూలు చేసింది. అప్పట్లో 100 కోట్లు వసూలు చేస్తే అమ్మో అనుకునే వాళ్లు. అలాంటిది బాహుబలి రెండు పార్టులకు అగ్రతాంబూలం వేశారు.
- Attarintiki Daredi ( 2013 )
74.88 Cr
శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా 2013లో అత్తారింటికి దారేది చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో పవన్ కల్యాణ్, సమంత జంటగా నటించారు. ప్రణిత, నదియా, బ్రహ్మనందం, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలకు రెండు రోజుల ముందే సోషల్ మీడియాలో సగం సినిమా చక్కర్లు కొట్టింది. అయినా ఏమాత్రం తగ్గకుండా 74.88 కోట్లను వసూలు చేసి అప్పట్లో రికార్డు సృష్టించింది.
- Magadheera ( 2009 )
73.46 Cr
మగధీర చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లుఅరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆ సమయంలో టాలీవుడ్‌లో అత్యంత ఎక్కువ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రంగా మగధీర విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. 2009 జులై 31న విడుదల ఈ చిత్రం అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ గా చలామణి అవుతున్న పోకిరి రికార్డులను తిరగరాసి ఆ స్థానాన్ని దక్కించుకుంది. మగధీర చిత్రానికి కేవలం రూ.40.42 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. పుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.73.46 కోట్ల షేర్ వసూలు చేసింది.
- Pokiri ( 2006 )
36.00 Cr
Advertisement
టాలీవుడ్‌లో ఇండస్ట్రీలోనే ఓ రికార్డు సృష్టించింది పోకిరి చిత్రం. 2006 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మహేస్ బాబు చిత్రాలన్నింటికెల్లా హిట్ చిత్రంగా పోకిరి నిలిచింది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్‌రమ ప్రారంభమైన 75 సంవత్సరాలకు విడుదల అయింది. సినిమా సాధించిన కలెక్షన్లు రూ.36 కోట్లు దాటడం 75 ఏళ్ల సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డుగా నిలిచింది.
పోకిరి చిత్రం 200 కేంద్రాల్లో 100 రోజులకు పైగా నడిచి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది.
- Indra ( 2002 )
28.70 Cr
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్, సోనాలిబింద్రే హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇంద్ర. 2002 జులై 24న ఈ చిత్రం వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినిదత్ నిర్మించారు. అంతకు ముందు చిరంజీవి నటించిన మృగరాజు, డాడీ సినిమాలు నిరాశ పరచడంతో ఇంద్ర సినిమా పై ప్రేక్షకులు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం.. ఇండస్ట్రీ హిట్ కావడం విశేషం. 122 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శించబడి చరిత్ర సృష్టించింది. 28.70 కోట్లు వసూలు చేసింది ఇంద్ర.
- Narasimha Naidu ( 2001 )
21.90 Cr
నందమూరి బాలకృష్ణ అప్పట్లో ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. కమర్షియల్ గా ఆయన చేసిన సినిమాలు ఓ ట్రెండ్ సెట్ చేసాయనే చెప్పవచ్చు. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన నరసింహానాయుడు సినిమా ఓ చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. అత్యధిక లాభాలు అందించిన సినిమాలలో ఇది ఒకటి. 2001 జనవరి 11 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. ఈ సినిమా హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను భారీగా అందుకోవడంతో నిర్మాతకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మొత్తానికి రూ.20కోట్లకు పైగా షేర్స్‌ను అందించింది. ఓ విధంగా అప్పటివరకు అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమా ఇదే కావడం విశేషం.
- Nuvve Kavali 2000
19.40 Cr
అప్పటివరకు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన తరుణ్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. రిచా, సాయికిరణ్‌లకు కూడా నువ్వేకావాలి తొలి చిత్రం. మళయాళంలో యూత్‌ను అలరించిన నిరమ్ ఆధారంగా నువ్వేకావాలని చిత్రం రూపొందింది. అప్పటికే తెలుగు రీమేక్ రైట్స్ మరొక ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ కొనుక్కున్నారు. ఎం.ఎస్.రెడ్డి ద్వారా ఈ సినిమా గురించి విన్న ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు, స్రవంతి రవికిషోర్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. రామోజీఫిలింసిటీలోనే నిర్మించమని.. ఖర్చు అంతా తమదేనని చెప్పారు. రవికిషోర్ అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి సినిమా పూర్తయిన తరువాత తన వాటా తీసుకున్నాడు. తక్కువ బడ్జెట్‌లో నిర్మించిన నువ్వేకావాలి సినిమా 19.40 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
Also Read: Balakrishna కెరీర్ లో డిజాస్టర్ మూవీస్ ఇవే!