Home » రోహిత్ ఖాతాలో మ‌రొక ప్ర‌త్యేక రికార్డు.. టీ 20ల్లో తొలి భార‌తీయుడు

రోహిత్ ఖాతాలో మ‌రొక ప్ర‌త్యేక రికార్డు.. టీ 20ల్లో తొలి భార‌తీయుడు

by Anji
Ad

భార‌త క్రికెట్ జ‌ట్టు గ‌త కొద్ది వారాలుగా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ.. నిరంత‌ర విజ‌యాల‌ను సాధిస్తోంది. రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని టీమిండియా ఫిబ్ర‌వ‌రి నెల‌లో జ‌రిగిన వ‌న్డే, టీ 20 సిరీస్‌ల‌లో వెస్టిండిస్‌ను సుల‌భంగా ఓడించింది. ఆ త‌రువాత శ్రీ‌లంక‌తో టీ20 సిరీస్ విజ‌యంతో ప్రారంభ‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కు బాల్‌, బ్యాటింగ్‌తో టీమిండియా ప్ర‌ద‌ర్శ‌న‌లో గ‌ణ‌నీయ‌మైన ఫ‌లితాల‌ను సాధిస్తోంది.

Also Read :  టీమిండియాదే టీ-20 సిరీస్.. శ్రీ‌లంక పై ఘ‌న విజ‌యం

Advertisement

భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఎప్ప‌టి మాదిరిగానే మెరుగైన క్యాచ‌ర్‌గా నిరూపించుకున్నాడు. జ‌స్ప్రీత్ బుమ్రా బంతికి పాతుమ్ నిశాంక‌ను సులువుగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో అత‌ని అంత‌ర్జాతీయ టీ-20లో 50 క్యాచ్‌లు కూడా పూర్త‌య్యాయి. ఈ ఫార్మాట్‌లో 50 క్యాచ్‌లు ప‌ట్టిన తొలి భార‌తీయుడు ప్ర‌పంచంలోనే నాలుగో ఫీల్డ‌ర్‌గా నిలిచాడు. 44 క్యాచ్‌ల‌ను ప‌ట్టిన విరాట్ కోహ్లీ రెండ‌వ‌స్థానంలో ఉన్నాడు.

Advertisement

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక టీమ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 5 వికెట్లు కోల్పోయి 183 ప‌రుగులు సాధించింది. దీంతో టీమిండియా ఎదుట 184 ప‌రుగుల టార్గెట్‌ను ఉంచింది. టీమ్‌లో నిస్సాంక 75 ప‌రుగులు సాధించి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. చివ‌రిలో ష‌న‌క కేవ‌లం 19 బంతుల్లో 47 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఇందులో 5 సిక్సులు, 2 ఫోర్లున్నాయి.

తొలి ఓవ‌ర్‌లోనే దుష్మంత చ‌మీర బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (1) ఔట‌య్యాడు. అంత‌కుముందు మ్యాచ్‌లో హీరో ఇషాన్ కిష‌న్ 16 ప‌రుగులు చేసి ల‌హిర కుమార బౌలింగ్‌లో ఔట‌య్యాడు. శ్రేయాస్ అయ్య‌ర్‌, సంజూశాంస‌న్ 47 బంతుల్లో 84 ప‌రుగులు జోడించి మూడ‌వ వికెట్‌కు అద్భుత‌మైన భాగ‌స్వామ్యాన్ని అందించారు. శాంస‌న్ 25 బంతుల్లో 39 ప‌రుగులు చేసి ఫెర్నాండో చేతిలో ఔట్ అయ్యాడు. వీరిద్ద‌రూ నాలుగ‌వ వికెట్‌కు 26 బంతుల్లో అజేయంగా 58 ప‌రుగులు జోడించి భార‌త్‌కు విజ‌యాన్ని అందించారు. జ‌డేజా మైదానంలోకి రాగానే ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించి 18 బంతుల్లో నాటౌట్ 45 ప‌రుగులు చేసాడు. శ్రేయాస్ కూడా 44 బంతుల్లో 74 ప‌రుగుల‌తో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భార‌త్ 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశివారికి బంధువుల‌తో త‌గాదాలు

Visitors Are Also Reading