భారత జట్టు ఏదైనా సరే క్రికెట్ లో రాణిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ప్రపంచ కప్ ని గెలవకపోవచ్చు. కానీ భారత పురుషుల అంధుల జట్టు మాత్రం మరోమారు ప్రపంచ క్రికెట్ లో తన ప్రస్ధానాన్ని నిలబెట్టుకుంది. భారత్ వేదికగా జరుగుతున్న మూడో అంధుల టీ-20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ ని ఫైనల్ లో 120 పరుగుల భారీ తేడాలో ఓడించి టైటిల్ ని కైవసం చేసుకుంది టీమిండియా.
Advertisement
అంధుల క్రికెట్ లో భారత్ జట్టుకు ఇది హ్యాట్రిక్ కప్ కావడం విశేషం. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు చెలరేగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 277 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారతజట్టు 120 పరుగుల భారీ తేడాతో ఛాంపియన్ గా నిలిచింది. 6 దేశాల మధ్య డిసెంబర్ 5 నుంచి ప్రారంభం అయిన ఈ టోర్నీలో ప్రారంభం నుంచి భారతజట్టుదే ఆధిపత్యం కొనసాగింది.
🏆 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒! Congratulations to the Indian team on winning the T20 World Cup for the blind for the third consecutive time.
Advertisement
🙌 You've made us proud, Champs!#INDvBAN #BANvIND #T20WorldCup #TeamIndia #BharatArmy pic.twitter.com/IbZy5BlaK1
— The Bharat Army (@thebharatarmy) December 17, 2022
లీగ్ రౌండ్ మ్యాచ్ లలో తొలిస్థానాన్ని కైవలం చేసుకోవడం ద్వారా టీమిండియా సెమిఫైనల్ కి చేరుకుంది. సెమిఫైనల్ లో భారత్ 207 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్స్ కి చేరుకుంది. బంగ్లాదేశ్ రెండో సెమీఫైనల్ లో శ్రీలంకను ఓడించింది. టీమిండియాకు ఇది మూడో ప్రపంచ కప్ కావడం విశేషం. 2012లో మొదటిసారి టోర్నీ నిర్వహించగా అందులో భారత జట్టు టైటిల్ గెలుచుకుంది. ఆ తరువాత 2017లో జరిగిన రెండో టోర్నీలో బెంగళూరులో జరిగిన ఫైనల్ లో టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. 2022లో భారత్ కూడా కప్ కొట్టి ఈ టోర్నీలో హ్యాట్రిక్ ను పూర్తి చేసింది. ఈ తరుణంలో మూడోసారి ఛాంపియన్ గా నిలిచిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
Also Read : ఫిఫా ప్రపంచ కప్ లో విజేత ఎవరు ? అర్జెంటీనా విజేతగా నిలిస్తే నమోదు కానున్న 6 రికార్డులు ఇవే.. !