Home » ‘నా సామి రంగ’తో నాగార్జున పండక్కి బరిలో.. తగ్గే ప్రసక్తే లేదా..?

‘నా సామి రంగ’తో నాగార్జున పండక్కి బరిలో.. తగ్గే ప్రసక్తే లేదా..?

by Anji
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగకు ఉన్నంత క్రేజ్ మరే పండుగకు ఉండదు అనే చెప్పాలి. ముఖ్యంగా సంక్రాంతి పండుగను ఎక్కువగా ఆంధ్రాలో కోడిపందెలు, ఎడ్లపందెలు రకరకాలుగా జరుపుకుంటారు. అలాగే పండుగకి సినిమాలను వీక్షించే వారు కూడా అధికంగానే ఉంటారు. అందుకే ఎక్కువగా సంక్రాంతి పండుగకు సినిమాలు విడుదల చేసేందుకు పోటీ పడుతుంటారు. 2023లో బాలయ్య వీరసింహారెడ్డి, మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, తమిళ నటుడు విజయ్ వారసుడు సినిమాల మధ్య పోటీ నెలకొంది.

Advertisement

ఇక ఈసారి  కేవలం టాలీవుడ్  నుంచే  సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. వీటిలో మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్ సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమా హనుమాన్ కూడా పండగ రిలీజ్ డేట్లను లాక్ చేసుకున్నాయి. అయితే ఇదే పండక్కి వస్తున్నామంటూ కొన్ని నెలల ముందే కింగ్ నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. నాగార్జున నటించిన “నా సామి రంగ” మూవీ ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నామని మూవీ మేకర్స్ గ్లింప్స్ తో అనౌన్స్ చేసాక మళ్ళీ ఇప్పటి వరకు పండగ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే మూవీ అప్డేట్స్ మాత్రం ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తున్నారు. పొంగల్ కి సినిమాలు ఎక్కువగా ఉండడంతో వాయిదా వేశారని ఆడియన్స్ అనుకున్నారు.

కానీ తాజాగా టైటిల్ సాంగ్ అనౌన్స్ మెంట్ తో పండక్కి వెన్కక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పేసారు. తాజాగా నా సామి రంగ టైటిల్ సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేయగా.. అందులోకి సంక్రాంతి కానుకగా జనవరి 13న నా సామి రంగతో వస్తున్నామని మూవీ మేకర్స్ తెలియజేశారు. దీంతో ఈ సారి సంక్రాంతి పోటీ మరింత టఫ్ గా మారిపోయింది. అయితే ఏదో ఒక సినిమా వెనక్కి తగ్గక పోతే కచ్చితంగా థియేటర్ల సమస్య వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అలా కాదంటే నిర్మాతలు లాంగ్ రన్ మీద డిపెండ్ అయ్యి థియేటర్లు సినిమా రిజల్ట్ ని బట్టి పంచుకోవాల్సి ఉంటుంది. ఇక సంక్రాంతి సినిమాల్లో అందరికంటే తర్వాత వస్తున్న నాగార్జున కి తక్కువ థియేటర్లు దొరికే ఛాన్స్ ఉందని సమాచారం.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading