కొంతమంది నటీనటులు ఒకటి, రెండు సినిమాల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలా గుర్తుండిపోయే హీరోయిన్లలో, సుందరకాండలో చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా అపర్ణ కూడా ఒకరు. అయితే ఈ పాత్ర కోసం రాఘవేంద్రరావు స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలి అనుకున్నారట. చివరికి కొత్త అమ్మాయి అయితే బాగా సూట్ అవుతుందని, భావించి అపర్ణాని తీసుకున్నారు. అయితే ఒక రోజు రాఘవేంద్రరావు నిర్మాత కె వి వి సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయనకు ఒక అమ్మాయి బాగా నచ్చింది.
Advertisement
ఆ అమ్మాయి అయితే సినిమాలోని పాత్రకి బాగా సూట్ అవుతుందని భావించి రాఘవేంద్రరావు గారు ఆ అమ్మాయిని ఫైనల్ చేయాలని అనుకున్నారు. సరిగ్గా 10 రోజుల తర్వాత సినిమా కోసం జరిగినటువంటి ఆడిషన్స్ కు ఆ అమ్మాయి కూడా రావడం జరిగింది. దీంతో అక్కడున్న వారిని రాఘవేంద్రరావు ఈ అమ్మాయి ఎవరు అని అడిగారట. అక్కడ అసిస్టెంట్ ఈమె సత్యనారాయణ మేనకోడలు సార్ ఆమె పేరు అపర్ణ అని చెప్పారట. ఇదే సమయంలో రాఘవేంద్రరావు ఆమెను ఓకే చేసేసారు. అయితే అపర్ణకు అసలు యాక్టింగ్ వచ్చా రాదా అని మొదట్లో టెన్షన్ పడ్డారు.
Advertisement
కానీ షూటింగ్ లో ఆమె అద్భుతంగా నటించిందట. అయితే ఈ సినిమా తర్వాత అపర్ణకు అనేక అవకాశాలు వచ్చాయట. కానీ వారి కుటుంబ సభ్యులు హీరోయిన్ గా చేయించడం ఇష్టం లేక సినిమాలో నటించలేదట. కానీ దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్క పెత్తనం చెల్లెలి కాపురం అనే చిత్రంలో చివరిసారిగా నటించిందట. ఆ తర్వాత అపర్ణ 2002 వివాహం చేసుకొని అమెరికా వెళ్లి స్థిరపడిపోయింది. 1992 లో వచ్చిన రీమేక్ చిత్రం సుందరకాండ ఘనవిజయం అందుకుంది. దీంతో అపర్ణ పాత్రకి కూడా మంచి పేరు వచ్చింది. అలాంటి అపర్ణ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!