ప్రశాంత్ వర్మ… చూడటానికి కుర్రొడిలా ఉంటాడు. కానీ, తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్‌తో పోటీ పడే విధంగా మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఈ యంగ్ డైరెక్టర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఏ ఒక్క మూవీ కూడా నిరాశ పర్చలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. సినిమాను చూడటానికి థియేటర్‌కి వచ్చిన ప్రతి ఒక ఆడియన్ సంతృప్తిగానే ఇంటికి వెళ్తాడు. ఇలాంటి మినిమం గ్యారింటీ డైరెక్టర్ ఇప్పుడు భారీ ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. సూపర్ హీరోస్ నేపథ్యంలో సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేస్తున్నాడు.
దీనిలో మొత్తం 12 సినిమాలు రాబోతున్నాయి. అందులో ఫస్ట్ మూవీ HanuMan. ఒక సాధారణ యువకుడికి హనుమంతుడి పవర్స్ వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ చాలా మందికి అర్థమవడం లేదు. దీనిలో అర్థం కాకపోవడానికి ఏముంది? హనుమంతుడి పేరునే సినిమా టైటిల్ గా పెట్టారు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు మిస్టేక్ అన్నట్టే. అంటే.. అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. కానీ, మెయిన్ రీజన్ ఏంటంటే…? బ్యాట్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్…యాంట్ మ్యాన్ ఇలా మార్వెల్ లో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇక్కడ టాలీవుడ్‌లో ఇప్పుడు HanuMan.
హనుమాంతుడి పవర్స్ ఒకరికి రావడంతో అతను హనుమాన్‌గా మారిపోయాడని మూవీ టీం ఉద్దేశం. అందుకే ఈ సినిమాకు HanuMan అని టైటిల్ పెట్టారు. దీంతో అందరూ HanuManను హనుమాన్ అనుకుంటున్నారు. కానీ, వాస్తవానికి ఇది హనుమాన్ కాదు… “హను మ్యాన్”. ఇదే విషయాన్ని మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పలు సందర్భాల్లో చెప్పాడు. అయినా, ఈ మూవీ టైటిల్ ని హను మ్యాన్ అని కాకుండా హనుమాన్ అనే చదువుతున్నారు.. రాస్తున్నారు.. సినిమా రిలీజ్ తర్వాత అయినా… ఇది హనుమాన్ కాదు.. హను మ్యాన్ అని తెలుసుకుంటారేమో.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!