Home » నటి రాధ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

నటి రాధ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

ఒకానొక సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి ఆ తర్వాత కాలంలో కూడా తన అందంతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆ కాలంలోనే తన అందంతో, నటనతో పోటీపడిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మరింతగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన కూతురు ప్రముఖ హీరోయిన్ కార్తీకకు వివాహం జరిపించిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకలలో కార్తీక తన ఒంటినిండా బంగారు నగలతో మెరిసింది.

Advertisement

కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ అనే వ్యక్తితో కార్తీక ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పెళ్లి వేడుకలలో ఒంటినిండా బంగారు నగలతో దర్శనం ఇచ్చిన కార్తీక ను చూసి అసలు రాధా ఆస్తులు ఎంత అనే విషయం తెరపైకి వచ్చింది.ఒకవైపు ఎన్నో కోట్లు సంపాదించిన ఈమె ముంబై, కేరళలో కూడా ఫైవ్ స్టార్ హోటల్ లను నడుపుతూ మరింతగా సంపాదించిందని సమాచారం. అసలు విషయాలలోకి వెళితే.. 250 కి పైగా చిత్రాలలో నటించి కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన బంధువైన రాజశేఖరన్ నాయర్ అనే ముంబైకి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. రాధా పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి పలికిన ఈమె ముంబైలోని నివాసం ఉంటుంది. అంతేకాదు అక్కడే ఒక రెస్టారెంట్ ను కూడా నడుపుతోంది. ఇకపోతే కార్తిక తండ్రి రాజశేఖరన్ బీజేపీ నాయకుడు.

Advertisement

అంతేకాదు కేరళలోని అతి పెద్ద వ్యాపారవేత్త కూడా. 16 సంవత్సరాల వయసులోనే తమిళనాడు, ముంబైలో కూరగాయల దుకాణాలలో, హోటల్లో పనిచేసిన ఈయన 25 సంవత్సరాల అనుభవంతోనే తన స్వస్థలమైన కేరళలో హోటల్ వ్యాపారం మొదలుపెట్టారు. ఇక నేడు కోట్లాది రూపాయలను సంపాదించి ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఇకపోతే మొత్తం వీరి ఆస్తుల విలువ సుమారుగా రూ.400 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఏది ఏమైనా కార్తిక పెళ్లి ఫోటోలు చూస్తే చాలు రాధా, రాజశేఖర్ దంపతులు ఏ రేంజ్ లో ఆస్తులు కూడబెట్టారో అర్థం అవుతుంది. మొత్తానికి అయితే కార్తీక వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. మరి ఇకనైనా కార్తిక సినిమాలలోకి వస్తుందా లేక తన తల్లి లాగే పెళ్లి తర్వాత వ్యాపారానికే పరిమితం అవుతుందా అన్నది చూడాలి.

Visitors Are Also Reading