Home » అన్నం గంజి ఆరోగ్యం రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..! 

అన్నం గంజి ఆరోగ్యం రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..! 

by Anji
Ad

భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ఆహారం బియ్యం. దీనిని రకరకాలుగా వండుకోవచ్చు. సాధారణంగా చాలా మంది అన్నం వండేటప్పుడు నీళ్లు ఎక్కువగా పోసి గంజిని వంచుతుంటారు. కానీ అలా చేయడం తప్పు అంటున్నారు వైద్య నిపుణులు. వండిన అన్నం గంజి వార్చిస్తే.. చాలా వరకు పోషకాలు వృదా అవుతాయి అంటున్నారు నిపుణులు. గంజి తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలను అనేకం ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా గంజిలో అధిక పోషకాలుంటాయి. విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. 

Advertisement

  • గంజి తాగడం వల్ల శరీరానికి త్వరిత శక్తి అందుతుంది. దీంతో శరీరం అలసట చాలా వరకు పోతుంది. 
  • గంజి మన చర్మానికి చాలా మేలు చేస్తుంది. అతి నీల లోహిత కిరణాలు, ఇన్ ఫెక్షన్ల ప్రభావాన్ని తగ్గించే శక్తి గంజికి ఉంది. అన్నంలోంచి వంచిన గంజి నీటిని ముఖానికి పట్టించడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. 
  • ఈ రోజుల్లో చాలా మంది జుట్టు నెరవడం, జుట్టు రాలడ అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. గంజిని తలకు పట్టించి దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకు అలాగే ఉంచితే తేలికపాటి షాంపు కండీషనర్ తో జుట్టును కడగాలి. 
  • వండిన అన్నం గంజిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇలా చేయడం వల్ల ముఖంలోని బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.

Also Read :  మీ పిల్లల ముందు ఈ పనులు అస్సలు చేయకండి..!

Advertisement

  • Ganji: అయ్యో..! అన్నం ఉడికిన తర్వాత గంజి పారబోస్తున్నారా..? పెద్ద తప్పే  చేస్తున్నారు.. | 5 Greatest Health Benefits of Eating Rice Porridge | TV9  Telugu
  • గంజి వినియోగం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పలు అధ్యయనాలలో నిరూపించబడింది.  
  • గంజిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. దీంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. 
  • నిత్యం అన్నం గంజి తాగే వారి శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. 
  • మీరు హైపోటెన్షన్ లేదా తక్కువ రక్తపోటుతో పోరాడుతున్నట్టయితే గంజిలో ఉప్పు కలుపుకొని తాగొచ్చు. 
  • వైరల్ ఫీవర్ లో గంజి తక్కువ ఏమి కాదు. కాస్త ఉప్పు కలిపి తాగితే జ్వరం త్వరగా మాయమవుతుంది. 
  • గంజి తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అనేక శరీర సమస్యలను నయం చేస్తుంది. 

Also Read :  ఖాళీ కడుపుతో లవంగాలను తినడం వల్ల కలిగే లాభాల గురించి మీకు తెలుసా ? 

Visitors Are Also Reading