Home » హీరో నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

హీరో నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

టాలీవుడ్ నేచురల్ స్టార్ హీరో నాని గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఈయన ప్రముఖ దర్శకుడు బాపు గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి.. అష్టాచమ్మా సినిమాతో  హీరోగా మారాడు. ఆ సినిమా తరువాత సినిమా సినిమాకి తన పంథాను మార్చుకొని మంచి స్క్రిప్ట్ ల ను ఎంచుకొని సినిమాలను చేస్తూ.. ఇవాళ ఇండస్ట్రీలో తనకంటే ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు నాని సినిమా అంటే ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తారు. 

Advertisement

రీసెంట్ టైమ్స్ తో నాని ఎంచుకున్న సినిమాల లిస్ట్ ను ఓ సారి చూసినట్టయితే టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. జెర్సీ, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా వంటి సినిమాలు నానిలో వేరియేషన్స్ ని చూపించాయి. నాని సినిమాలు నానిలో వేరియేషన్స్ ని చూపించాయి. నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా   హాయ్ నాన్న. ఈ మూవీతో శౌర్య అనే కొత్త దర్శకుడి పరిచయమవుతున్నాడు. నాని సరసన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ సినిమాకి హృ దయం ప్రేమ్ అబ్దుల్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 

Advertisement

ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా ఈ మూవీపై భారీ అంచనాలను పెంచుతుంది. ఈ సినిమా డిసెంబర్ 07న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోసన్స్ ని మొదలుపెట్టారు. ఓ ఇంటర్వ్యూను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఆ ఇంటర్వ్యూలో మృణాల్, నాని మధ్య ఓ ఫన్నీ ఇంట్రాక్షన్ జరిగింది. నాని ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. అది ఏంటంటే.. ఫస్ట్ తనకు 2500 చెక్ వచ్చిందని అది కూడా చెక్ బౌన్స్ అయిందని నవ్వుకున్నాడు నాని. అది ఇప్పటి నా దగ్గరే ఉందని కూడా వెల్లడించారు నాని.  ఫస్ట్ పేమెంట్ బౌన్స్ అయినా కూడా దానిని ఓ , జ్ఞాపకంగా గుర్తు పెట్టుకొని. కెరీర్ లో బ్యాన్స్ బ్యాక్ అయి నేడు స్టార్ హీరోగా ఎదిగాడు నాని. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading