అతిలోక సుందరి శ్రీదేవి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందం, అభినయం, నటనలలో శ్రీదేవి చాలా ప్రత్యేకత చాటుకుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలోటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది. ఈమె తమిళనాడు లోని శివకాశిలో జన్మించింది. శ్రీదేవి ఒక అగ్ర కథానాయక. ఆమె తన నట జీవితాన్ని బాల నటిగా కన్దన్ కరుణై (1967) అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టినది. అయితే 1975 లో విజయచిత్ర అని ఒక తెలుగు పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తుణైవన్ అనే చిత్రం తన మొదటి తమిళ చిత్రం అని చెప్పింది.
Advertisement
భాషతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్ నుంచి ఏఎన్ఆర్ వరకు అందరూ స్టార్ హీరోలతో జతకట్టి అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే శ్రీదేవి తన ప్రతి సినిమాకి అందుకున్న రెమ్యూనరేషన్ తో పోలిస్తే, తన కూతురు జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన దేవర సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ తో పోలిస్తే, కొన్ని రేట్లు అధికంగా ఉంది. అయితే అప్పటి కాలంలో ప్రస్తుతాన్ని పోల్చడం సరికాదు. కానీ, తల్లీ కూతుళ్ల రెమ్యునరేషన్ లో భారీ వ్యత్యాసం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది.
అయితే 1990 మే 9న విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సాధించి రూ.15 కోట్లు వసూలు చేసింది. కాగా ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి రూ.35 లక్షలు తీసుకోగా.. చిరుకి సమానంగా శ్రీదేవి ఏకంగా రూ. 25 లక్షలు తీసుకుంది. కాగా శ్రీదేవి కెరీర్ లో హై ఇదే అని చెప్పాలి. ఇక జాన్వి కూడా తక్కువ లేదు. దేవర సినిమా కోసం దాదాపుగా ఆమె రూ.3.5 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. అయితే జాన్వి కపూర్ నటించిన మొదటి చిత్రం ధడక్ కోసం అక్షరాల 60 లక్షల రూపాయలు అందుకుంది. కానీ శ్రీదేవి 1975లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం హీరోలతో సమానంగా వేతనాలను తీసుకునేదట. ప్రజెంట్ ఈ టాపిక్ వైరల్ అవుతుంది.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!