సాధారణంగా నిమ్మ జాతి పండ్లకు సంబంధించి మనం దానిని తొక్క తీసేసి తింటుంటాం. నిమ్మజాతి తొక్క ఏదైనా మనకు ఎంతో ఉపయోగం అన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నిమ్మజాతి పండ్లు నిమ్మ, బత్తాయి, కమలం వంటి పండ్లు రుచికి కాస్త పుల్లగా ఉన్నప్పటికీ వాటి తొక్క వల్ల చాలా ఉపయోగమే ఉంటుంది. ముఖ్యంగా చర్మం, జుట్టు, పొట్ట ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సాధారణంగా నిమ్మకాయను రసం పిండి తొక్కలను పడేస్తుంటాం. బత్తాయి పండులో కూడా తొక్క తీసేసి తింటుంటాం. కానీ వాటి ప్రయోజనాలు తెలిస్తే ఇక అలాంటి తప్పు చేయాలని ఎవ్వరూ అనుకోరేమో. నిమ్మకాయ తొక్కలను పలు రకాలుగా ఉపయోగించవచ్చు. నిమ్మజాతి తొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
నిమ్మ జాతి తొక్కల ఉపయోగాలు :
- నిమ్మ తొక్కల్లో విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతాయి.
- యాంటీ ఆక్సిడెంట్లు కూడా నిమ్మ జాతి తొక్కల్లో కనిపిస్తుంటాయి. శరీరానికి బాహ్య, అంతర్గత మార్గంలో ప్రయోజనం చేకూరుస్తాయి.
- నిమ్మ జాతి తొక్కలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- ఈ తొక్కలతో యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇవి దంతాలు, నోటి సమస్యలను దూరం చేస్తాయి.
తొక్కలను రుబ్బుకుని కూరగాయలు, పానీయాలు, లేదా సలాడ్ కలుపుకొని తీసుకోవచ్చు.
Advertisement
నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలి
- నిమ్మ జాతి తొక్కలను మిక్సి పట్టుకొని ఆలివ్ నూనెతో కలిపి పలు వంటకాలను తయారు చేసుకోవచ్చు.
- నిమ్మ తొక్కలను రుబ్బిన తరువాత మిక్సిలో గ్రౌండ్ చేస్తే బ్రెడ్ స్ప్రెడ్ గా తయారు అవుతుంది.
- వంట గదిని శుభ్రం చేయాలనుకుంటే మీరు నిమ్మ తొక్కల్లో సగం బేకింగ్ సోడాను కలిపి గ్యాస్, పలు పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు.
- బేకింసోడా కాకుండా తొక్కల్లో వెనిగర్ ను కూడా ఉపయోగించవచ్చు
- ముఖ్యంగా వర్షాకాలంలో మీ శరీరంపై ఉన్న క్రిములు నశించిపోవడానికి నిమ్మతొక్కలను శరీరంపై అప్లై చేయండి.
- వంటగదిలో ఏదైనా మూలలో వాసన వస్తుంటే నిమ్మతొక్కను అక్కడ పెడితే వాసన పోతుంది.
- నిమ్మ తొక్కలను గ్రైండ్ చేసి తేనె కలిపి ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. ఇది ముఖాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది.
- నిమ్మకాయ తొక్కలను పలు ఫేస్ మాస్క్ ల తయారీలో కూడా ఉపయోగించవచ్చు.
ఇది కూడా చదవండి : మీరు వంటల్లో ఉపయోగించే కారం పొడి స్వచ్ఛమైనదా..? కాదా అని ఇలా చెక్ చేయవచ్చు..!