ఆచార్య చాణిక్యుడు గొప్ప మేధావి. రాజనీతి శాస్త్రజ్ఞుడు వ్యూహ కర్త, మానవ జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పిన గొప్ప నీతి బోధకుడు. ఆయన చెప్పిన ఎన్నో సలహాలు సూచనలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో భార్యాభర్తల గురించి అనేక విషయాలు చెప్పారు. భర్తకు ఈ లక్షణాలు ఉంటే స్త్రీ చాలా సంతోషంగా ఉంటుందట.
కమ్యూనికేషన్:
ఏ సంబంధంలోనైనా ప్రభావంతమైన కమ్యూనికేషన్ కీలకమైంది. దాంపత్య బంధం దానికి మినహాయింపు కాదు. భాగస్వామితో బహిరంగంగా నిజాయితీగా కమ్యూనికేట్ చేయగల భర్త శాశ్వత బంధాన్ని నిర్మించుకునే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ అంటే ఆలోచనలు కోరికలు పంచుకోవడం. ప్రతి భర్త దాపరికం లేని కమ్యూనికేషన్ భార్యతో కలిగి ఉంటే ఆ స్త్రీ సంతోష పడుతుందట.
also read:అబ్బాయిలు ఈ లక్షణాలు కలిగి ఉంటే… అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడతారు
Advertisement
Advertisement
బాధ్యత:
బాధ్యతాయుతమైన భర్త తన కుటుంబ అవసరాలను ఆచరణాత్మకంగా అలాగే బాగోగులు వేగంగా చూసుకునేవాడు. ఇంటి పనులలో క్రియాశీలక పాత్ర పోషించడం, తప్పు చేస్తే జవాబుదారీలా ఉండే భర్త దొరికితే జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటుందట.
also read:శుక్రవారం రోజు ఇలా చేస్తే మీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా..!
గౌరవం:
ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం గౌరవించడం. ముఖ్యంగా దాంపత్య జీవితంలో కూడా ఉండాల్సిన లక్షణం ఇది అని చాణిక్యుడు అంటున్నారు. దంపతులు ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవాలి. చులకన చేసి మాట్లాడడం , బయట వాళ్ల ముందు అవమానించడం వంటివి చేయరాదట. ముఖ్యంగా భార్యను గౌరవించే వ్యక్తి భర్తగా దొరికితే ఆ స్త్రీ సంతోషంగా ఉంటుందని చాణిక్యుడు అంటున్నారు.
also read:ఈరోజుల్లో గోర్లు అస్సలు కత్తిరించరాదు.. కారణమేంటంటే..?