Home » నెయ్యి ఇలా తింటే బరువు తగ్గడం పక్కా..!

నెయ్యి ఇలా తింటే బరువు తగ్గడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా  నూనెలు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారనే విషయం తెలిసిందే. ఎంత ఎక్కువ కొవ్వు, కేలరీలు తింటే నడుము చుట్టూ అంత ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే బరువు పెరగడానికి బదులుగా కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. అవును ఇది అక్షరాల సత్యం. నెయ్యి తినడం వల్ల బరువు తగ్గవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు. నెయ్యిలో ఒక రకమైన ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా అన్ని పోషకాలను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. సరైన శరీర బరువును నిర్వహించడం సులభం అవుతుంది. నెయ్యిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Advertisement

అంతేకాకుండా విటమిన్ ఎ, ఇ, డి వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. ఇవి కాల్షియం శోషణలో సహాయపడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నెయ్యిలో కేలరీలు ఉన్నప్పటికీ ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే నెయ్యిలో సంతృప్తి కొవ్వు, మోనో శాచురేటెడ్ కొవ్వు ఉంటాయి. కాబట్టి నెయ్యి తినడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. అతిగా తినడం తగ్గుతుంది. ఈ విధంగా మీరు బరువు తగ్గవచ్చు. చాలాకాలంగా థైరాయిడ్ తో బాధపడుతున్న వారు నెయ్యి తినడం వల్ల థైరాయిడ్ హార్మోన్, అధిక బరువు రెండు నియంత్రణలో ఉంటాయి.

Advertisement

నెయ్యిలో అయోడిన్ ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువును కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఓ స్పూన్ నెయ్యి తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇందులో మీడియం పరిమాణంలో చైన్ ట్రైగ్లిజరిన్ ఉంటాయి. జీర్ణమై శక్తిగా మార్చబడతాయి. ఇవి జీవక్రియను పెంచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి అనేక విధాలుగా సహాయపడుతాయి. సరైన శరీర బరువును నిర్వహించడానికి క్రమం తప్పకుండా నెయ్యిని కూడా తీసుకోవచ్చు. ఇది ఊబకాయం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

 మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading