Home » ప్రతిరోజూ ఉదయం ఈ టీ తాగితే డయాబెటీస్ అడ్డుకోవడం గ్యారెంటీ..!

ప్రతిరోజూ ఉదయం ఈ టీ తాగితే డయాబెటీస్ అడ్డుకోవడం గ్యారెంటీ..!

by Anji
Ad

సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటీస్ కూడా ఒకటి. ఒక్కసారి ఈ డయాబెటీస్ ఎటాక్ చేస్తే.. జీవితాంతం బాధ పడాల్సిందే. ఇది వచ్చినంత కాలం కంట్రోల్ చేసుకోవడం తప్పించి.. ఇందుకు మెడిసిన్ కూడా లేదు. భారత దేశంలోనే ఎక్కువగా ఈ డయాబెటీస్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన తర్వాత బాధ పడడం కంటే ఇది రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తాజాగా అధ్యయనం చేసిన ప్రాకారం ప్రతిరోజూ బ్లాక్ టీ తాగే వారిలో డయాబెటీస్ వచ్చే అవకాశం తగ్గుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి.

Advertisement

అతేకాకుండా పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలు కూడా ఉంటాయి. వాటి వల్ల మధు మేహం వచ్చే అవకాశం 50 శాతం వరకు తగ్గుతున్నట్లు గుర్తించారు. కాబట్టి ప్రతి రోజూ ఉదయం బ్లాక్ టీ తాగితే చాలా మంచిది. దాదాపు లక్షల మంది పెద్దలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీరికి రకరకాల టీలను అందించారు. ఈ టీలు వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో పరిశీలించారు. ఈ క్రమంలో రక్తంలో చక్కర స్థాయిలులు పెరగడం వంటి వాటిని పరిశీలించారు. మిగతా టీలతో పోలిస్తే బ్లాక్ టీ తాగే వారిలో షుగర్ వచ్చే అవకాశం తగ్గినట్టు గుర్తించారు. దీన్ని బట్టి మధు మేహానికి చెక్ పెట్టే లక్షణం బ్లాక్ టీకి ఉన్నట్లు తేల్చారు.

Advertisement


కేవలం బ్లాక్ టీ మాత్రమే కాకుండా.. గ్రీన్ టీ తో కూడా డయాబెటీస్ ను దూరం పెట్టొచ్చని వెల్లడించారు. మరొక అధ్యాయనంలో పది లక్షల మందిపై పరిశోధన చేశారు. వీరికి కొన్ని ఏళ్లపాటు గ్రీన్ టీ తాగమని చెప్పారు. ఈ పరిశోధనలో టైప్ 2 డయాబెటీస్ బారిన పడే అవకాశం 17 శాతం తగ్గినట్లు తెలిపారు. కాబట్టి గ్రీన్ టీ కూడా షుగర్ కంట్రోల్ కి సహాయపడుతుంది. షుగర్ రాకుండా జాగ్రత్తగా ఉండాలంటే మైదాతో చేసిన ఆహారానికి దూరంగా ఉండటం, వ్యాయామాలు చేయడం, ఫ్రెష్ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి తినడం వల్ల ద్వారా మధు మేహాన్ని దూరంగా ఉంచుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading