Home » సుకుమార్ తెరకెక్కించిన ఆ సినిమా ఫ్లాప్ కాకుంటే.. తెలుగు సినిమా రేంజ్ మరోలా ఉండేదా..?

సుకుమార్ తెరకెక్కించిన ఆ సినిమా ఫ్లాప్ కాకుంటే.. తెలుగు సినిమా రేంజ్ మరోలా ఉండేదా..?

by Anji
Ad

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు తీయడంలో దిట్ట. అందులో సక్సెస్ సాధించడంలో కూడా ముందుంటాడు. ఆర్య నుంచి పుష్ప వరకు తీసిన సినిమాలు ఒక్కో సినిమా ఒక్కో కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు. ప్రధానంగా ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు తీస్తే నచ్చుతాయనేది తెలుసుకొని ప్రేక్షకుల నాడి పట్టుకొని అలాంటి సినిమాలు తీసి సక్సెస్ సాధిస్తుంటారు. కొన్ని సార్లు వీళ్లు చేసిన ప్రయోగాలు ఫెయిల్ అవుతుంటాయి.

Advertisement

ప్రధానంగా సుకుమార్  తీసిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా పొందుతూ ఉంటాయి. ఇలాంటి సుకుమార్ మహేష్ బాబు తో చేసిన వన్ సినిమా ప్లాప్ అయినప్పటికీ ఆ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంది. అలాగే వన్ సినిమా కొంచెం స్క్రీన్ ప్లే ప్రాబ్లమ్ వల్ల సినిమా పెద్దగా ఆడలేదు. కానీ మంచి పొటెన్షియాలిటీ ఉన్న సినిమా ఇది. ఒక స్టార్ హీరో ను అలా కూడా చూపించవచ్చా అనేంత రేంజ్ లో ఒక ఎక్స్ పర్ మెంట్ చేశాడు. అయితే ఈ సినిమా సక్సెస్ అయి ఉంటే బాగుండేది. కానీ అది పెద్దగా ఆడలేదు దాంతో సుకుమార్ ప్రయోగాలు ఏమి చేయకుండా ఆ తర్వాత నుంచి స్ట్రైయిట్ ఫార్వార్డ్ గా స్క్రీన్ ప్లే రాసుకొని ప్రేక్షకులకు అర్థమయ్యే సినిమాలను చేస్తున్నాడు.

Advertisement

 ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఒక మంచి సినిమా చేయమని చెప్తే ప్రేక్షకుడి ఐక్యూ లెవల్ ని టెస్ట్ చేస్తూ ఒక సూపర్ హిట్ సినిమా చేసే సత్తా ఆయన దగ్గర ఉంది. కానీ స్టార్ హీరోకి ఉన్న కొన్ని లిమిటేషన్స్ అలాగే ప్రొడ్యూసర్స్ కి ఉండే భయాలు, ప్రేక్షకుడి అర్థం చేసుకోలేని తనంతో ప్రేక్షకుడుకి నచ్చే సినిమాలు చేస్తే చాలు అని తను కూడా అవే సినిమాలు చేస్తున్నాడు.  ప్రేక్షకుడు ఒక టైప్ ఆఫ్ స్టోరీలకు ఫిక్స్ అయిపోయి ఉన్నాడు ఆ స్టీరియోని బ్రేక్ చేసి ఒక కొత్త సినిమాని ప్రేక్షకులు ఎక్కించాలి అంటే కొంచెం టైమ్ అవుతుందని తెలుసుకున్న సుకుమార్ ఇంటెలిజెంట్ సినిమాలు కాకుండా రెగ్యులర్ ఫార్మాట్లో సినిమాలు చేశాడు. అందులో భాగంగా వచ్చిన సినిమాలే రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలు…ఇవి మాస్ ఆడియన్స్ తో పాటు ప్రతి ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకొని సక్సెస్ సాధించాయి.

కానీ ఆయనకి ఇలాంటి సినిమాలు చేయడం కంటే ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడం అంటేనే చాలా ఇష్టం అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. వన్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నా సినిమాలను అర్థం చేసుకునే అంత తెలివి ప్రేక్షకులకు లేదు అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా సుకుమార్ లాంటి మేకర్ చేసే సినిమాలు అర్థం చేసుకునే నాలెడ్జ్ ప్రేక్షకుల దగ్గర లేదు అనేది మాత్రం వాస్తవం. ఒక మూస ధోరణిలో సినిమాలకు అలవాటు పడిపోయిన ప్రేక్షకుడిని మెల్లగా డిఫరెంట్ అటెంప్ట్ సినిమాలకు అలవాటు చేయాలంటే కష్టమవుతుంది. ఆ కాలుక్యులేషన్స్ ఏమీ లేకుండా వన్ సినిమా చేశాడు. ఇక దాని ఫలితం ఎలా ఉన్నా కూడా ఆయన ఒక డిఫరెంట్ డైరెక్టర్ అనే పేరు అయితే మాత్రం సంపాదించుకున్నాడు

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading