Ad
పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు అన్నారు ఓ కవి. ఎవరి పుట్టుక కానీ, చావు కానీ వారి చేతుల్లో ఉండదు. పుట్టినప్పుడు మీరు ఎలా ఉంటారో మీకు తెలియదు. చనిపోయినప్పుడు కూడా మీరు ఏ విధంగా ఉంటారో మీకు తెలియదు. అలా పుట్టుక చావు మధ్యలోదే మనిషి జీవితం. అలాంటి వాటిలో చావుతో మనిషి జీవితం ముగిసిపోతుంది. గరుడ పురాణం ప్రకారం మరణించిన వారి గురించి అనేక విషయాలు చెప్పారు. ముఖ్యంగా మరణించిన వారి వస్తువులను ఉపయోగిస్తే ఏం జరుగుతుందో క్లియర్ గా తెలియజేశారు. మరి అదేంటో చూద్దామా..
అయితే ఎవరైనా మరణిస్తే వారి యొక్క వస్తువులను కొంతమంది కుటుంబ సభ్యులు అలాగే ఉంచుకుంటారు.
మరి కొంతమంది ఆ వస్తువులను దహన సంస్కారాలలోనే నాశనం చేస్తారు. మరణించిన వారి ఈ వస్తువులను మన దగ్గర ఉంచుకుంటే అనర్థాలు జరుగుతాయట.. ఆ వస్తువులు ఏంటో చూద్దామా.. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలు ధరించిన వారికి ఆత్మ ఆవహిస్తుందని అంటారు. అలా జరగకూడదు అంటే వాటితో మరో కొత్త డిజైన్లలో ఆభరణాలు చేయించుకోవడం మంచిదని అంటున్నారు. అలాగే చనిపోయిన వారి దుస్తులను అస్సలు ధరించకూడదట.
అలా చేయడం వల్ల రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అలాగే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. అందుకే మరణించిన వారి దుస్తులను బయట పారేయడమే మంచిదని తెలియజేస్తున్నారు. అలాగే కొంతమంది కుటుంబ సభ్యులు చనిపోయిన వ్యక్తుల యొక్క చేతి గడియారం కూడా ఎవ్వరూ ఉపయోగించకూడదు. దీనివల్ల మరణించిన వారు పదేపదే కలలో కనిపిస్తూ ఉంటారట. అందుకే మరణించిన వారి ఈ వస్తువులను అస్సలు ఉపయోగించరాదు.
Advertisement