పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లలకు సంబంధించి ప్రతీ విషయంలోనూ తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వయసుకు తగ్గట్టుగా హైట్‌గా, బరువు ఉండాలని అనుకుంటారు. కానీ కొంత మంది పిల్లలు నీరసంగా, హైట్ తక్కువగా ఉంటారు. పిల్లలు హైట్ అనేది ఇంట్లో వాళ్ల జీన్స్ ప్రకారం కూడా ఆధార పడి ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లలు ఎత్తు ఎదగడంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. దీని కోసం మీరు ప్రతి రోజూ పోషకాలు ఉన్న పదార్థాలను పిల్లలకు ఇవ్వడం వల్ల హైట్ పెరుగుతారు. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
- పిల్లలకు ప్రతి రోజూ పాలు ఇవ్వడం వల్ల ఎత్తు పెరుగుతారు. పాలులో ఇండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే పాలకు సంబంధించిన ఉత్పత్తులు పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
- ప్రతి రోజూ గుడ్డు తింటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. ఎదిగే పిల్లలకు ప్రతి రోజూ ఉదయం గుడ్డు ఇవ్వడం వల్ల వారు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా హైట్ పెరిగేందుకు హెల్ప్ అవుతుంది.
- క్యారెట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక విటమిన్లు ఉంటాయి. ఉదయం కానీ, సాయంత్రం కానీ పిల్లలకు ఒక పచ్చి క్యారెట్ ఇవ్వడం వల్ల చాలా మంచిది.
- సోయాబీన్‌లో కూడా ప్రోటీన్ కంటెంట్ అనేది మెండుగా ఉంటుంది. ఇది ఎత్తు పెంచడంలో సహాయ పడుతుంది.
- అదే విధంగా పిల్లలకు, చికెన్, మటన్ తినిపించడం వల్ల కూడా మంచిది. వీటిల్లో ఉండే ప్రోటీన్ కండరాల పెరుగుదలకు చాలా హెల్ప్ చేస్తుంది. చేపలు కూడా పిల్లల మెదడు అభివృద్ధికి చాలా హెల్ప్ చేస్తుంది.
- విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల.. హైట్ ఎదిగేందుకు సహాయ పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- పిల్లలు ఎత్తు పెరగడంలో ధాన్యాలు, పిండి పదార్థాలు తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. కాబట్టి ఇవి పిల్లలు బలంగా ఉండేందుకు కూడా సహాయ పడతాయి.