ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ అద్భుతమైన స్ట్రయిక్ రేట్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ తన జట్టుకు అద్భుత విజయాలు అందిస్తున్నాడు. ఇదే సమయంలో అతని భార్య, ప్రముఖ స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ డబ్ల్యూఎస్‌ఎఫ్ వరల్డ్ డబుల్స్ ఛాంపియన్స్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది.
Advertisement
డబ్ల్యూఎస్‌ఎఫ్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సౌరవ్ గోషల్‌తో కలిసి బరిలోకి దిగిన దీపిక పల్లికల్ కార్తీక్ శనివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ కు చెందిన అడ్రియన్ వాలర్, ఆలీసన్ వాటర్స్ జోడీపై 11-6, 11-8 తేడాతో గెలుపొందింది. ఈ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది.
Advertisement
ఈ టోర్నీలో రెండవ సీడ్‌గా బరిలోకి దిగిన పల్లికల్ జోడీ.. నాలుగో సీడ్ ఇంగ్లండ్ ద్వయంపై వరుస సెట్లలో విజయం సాధించి ఔరా అనిపించింది. పెళ్లి.. ఆ తరువాత ప్రసవం కారణంగా నాలుగేళ్ల పాటు స్క్వాష్‌కు దూరంగా ఉన్న పల్లికల్ బ్రేక్ తరువాత బరిలోకి దిగిన తొలి టోర్నిలోనే టైటిల్ సాధించి అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చింది. పల్లికల్ 2015లో క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి గత ఏడాది 2021, అక్టోబర్ 18న మగ కవలలు జన్మిచారు.