భార్యాభర్తల సంబంధం అంటేనే ఒకరికొకరు అర్థం చేసుకొని, ఏ టైంలో ఎవరు తగ్గాలో ఏ టైంలో ఎవరు నెగ్గాలో తెలుసుకుంటూ పోతేనే జీవితం సుఖమయం అవుతుంది. అలాంటి జీవితంలో పంతాలు ఉంటే మధ్యలోనే బ్రేక్ పడుతుంది.. ప్రస్తుత కాలంలో చాలా మంది భార్యలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.. అదేంటో చూసేద్దామా..
నా వయసు 34 సంవత్సరాలు. నేను మా రెండు సంవత్సరాల కొడుకు అమెరికాలో ఉంటాం. మా తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు. ఎంత డబ్బు ఉన్నా నా లైఫ్ బోరింగ్ గా ఉంది. దీనికి కారణం నా భర్త నా మీద ప్రేమ చూపించడు. ఎప్పుడో ఒకసారి ప్రేమగా చూసుకుంటారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఆఫీస్ నుంచి ఎప్పుడు ఇంటికి వచ్చినా ఆయన చుట్టూ ఉంటాను.
Advertisement
also read:అలా చెప్పి దుబాయిలో టార్చర్ చేశారు..నటి సనా బేగం..!!
Advertisement
కానీ ఆయన మాత్రం నాపై అస్సలు ప్రేమను చూపించడు.కుటుంబానికి టైం కేటాయించడు.. నేను చేసే ప్రతి పని విమర్శిస్తాడు. నేను ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఏదో ఒక పనితో బిజీగానే ఉంటాను. నా కొడుకు స్కూల్ వర్క్ లో హెల్ప్ చేస్తూ ఉంటాను. కానీ మా ఆయన నేను సోమరి అని భావిస్తాడు. ఎలాంటి పనిచేయకుండా ఇంట్లో ఉంటున్నానని అనుకుంటాడు. ఇక ఇంటి పనుల విషయంలో మా ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. మరి నా భర్త నాపై ప్రేమ చూపించాలంటే ఏం చేయాలో చెప్పండి.. ఈ ప్రశ్నకు ఒక ప్రముఖ డాక్టర్ సమాధానం ఇస్తూ.. ప్రతి వివాహ సంబంధానికి ప్రేమ, ఆప్యాయత, ఓపిక అనేది అవసరం. అంతేకాదు నీ శారీరక సాన్నిహిత్యం మీ భావాలు వ్యక్తపరచడానికి ఒక మార్గం..
also read:“బలగం” బడ్జెట్ 1.5కోట్లు.. లాభం ఎన్ని కోట్ల అంటే..?
మీ యొక్క వ్యక్తిగత జీవితంలో డిస్టబెన్స్ కు కారణం మీ భాగస్వామితో సరైన భావోద్వేగాన్ని,సంబంధాన్ని ఏర్పరచుకోకపోవడం.. ముఖ్యంగా మీ భర్తతో ఏదైనా ఒక సమయం చూసి మీ సమస్యను క్లియర్ గా చెప్పండి. కుటుంబానికి కొంత సమయం ఇవ్వమని సున్నితంగా వివరించండి. ఆయన ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వకుండా ఈ విషయాలు వ్యక్తపరచండి. ఒకవేళ ఆయన విమర్శిస్తే వెంటనే ఆ విమర్శకు ప్రతి విమర్శ చేయకుండా ఆయనకు అర్థమయ్యే రీతిలో చెప్పి చూడండి. దీనివల్ల మీ సమస్య కాస్త మెరుగుపడవచ్చు.
also read:అలా చెప్పి దుబాయిలో టార్చర్ చేశారు..నటి సనా బేగం..!!