Home » ప్రపంచకప్ నుంచి తప్పుకుంటే పాకిస్తాన్‌కు కోట్లల్లో నష్టం.. ఎంతంటే?

ప్రపంచకప్ నుంచి తప్పుకుంటే పాకిస్తాన్‌కు కోట్లల్లో నష్టం.. ఎంతంటే?

by Bunty
Ad

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఈ ఏడాది ఇండియాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐసీసీ సంస్థ… వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ కూడా ప్రకటించేసింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత మన ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు అంటే దాదాపు 40 రోజుల పాటు వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరగనుంది.

Advertisement

అయితే ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో… భారతదేశానికి వచ్చేందుకు పాకిస్తాన్ జట్టు సందేహాలు వ్యక్తం చేస్తోంది. భద్రతా కారణాలు చెప్పి టీమిండియాలో పర్యటించేందుకు అనేక… విషయాలను తెరపైకి తీసుకువస్తోంది పాకిస్తాన్. అయినప్పటికీ ఐసీసీ ఏమాత్రం తగ్గకుండా… పాకిస్తాన్ రాకపోయినా పర్లేదు.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ జట్టు కు ఛాన్స్ ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 కు దూరం అయితే… పాకిస్తాన్ జట్టుకు తీవ్ర నష్టం వాటిల్ల ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Advertisement

ప్రపంచ జట్లలో ఉన్న అన్ని జట్లకు ఐసిసి ప్రతి ఏటా నిధులు అందజేస్తుంది. అలాగే పాకిస్తాన్ జట్టుకు కూడా ఐసీసీ కొన్ని నిధులను అందజేస్తుంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న ర్యాంకు ప్రకారం ఆ బోర్డుకు… ఏకంగా 290 కోట్లు ఐసిసి అందించనుంది. అయితే ఒకవేళ వన్డే వరల్డ్ కప్ 2023 ఆడేందుకు పాకిస్తాన్ జట్టు రాకపోతే… ఆ నిధులను ఐసీసీ కట్ చేయనుంది. అష్ట కష్టాలలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు ఆ డబ్బులను కూడా కట్ చేస్తే… ఇంకా సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు. కాబట్టి పాకిస్తాన్ జట్టు కచ్చితంగా టీమిండియాలో పర్యటించి తీరుతుందని కొంతమంది వాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Sai Pallavi: ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న సాయిపల్లవి..?

Sangeetha: పెళ్లి త‌ర్వాత న‌ర‌కం చూశా.. భ‌ర్తను వదిలేద్దామనుకున్నా..!

భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !

Visitors Are Also Reading