హీరో అవ్వాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు ఇండస్ట్రీలోకి రావాలంటే ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కోవాలి. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా పెద్ద హీరో అవ్వాలంటే ఎంతో కష్టం. తండ్రులు లేదంటే కుటుంబ సభ్యులు ఎవరైనా ఇండస్ట్రీలో ఉంటే వాళ్లదారిలోనే వస్తూ ఉంటారు.
Advertisement
కానీ వాళ్లు కూడా ఎన్నో అడ్డంకులని ఎదుర్కొంటుంటారు. ఈ రోజుల్లో చాలామంది హీరోలకి సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా సక్సెస్ రావట్లేదు. సక్సెస్ అవుతారా లేదా అనేది కూడా తెలియట్లేదు. వచ్చిన అవకాశాలని వినియోగించుకుంటున్నా సరైన హిట్ రాట్లేదు. చాలామంది హీరోలు ఎంతో కష్టపడుతున్నారు.
హీరో వెంకటేష్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు వెంకటేష్ అందరికీ పరిచయమే. అప్పట్లో సినీ ఇండస్ట్రీ అంటే పెద్దగా ఇష్టం లేదు. అమెరికాకు వెళ్లి అక్కడ ఒక కంపెనీ పెట్టి దానిని చూసుకుంటూ వెంకటేష్ బిజీగా ఉండేవారు. ఆ టైంలో రామానాయుడు సురేష్ బాబు ని హీరో కింద పరిచయం చేయాలని అనుకున్నారు.
Advertisement
కానీ సురేష్ బాబు అందుకు ఒప్పుకోలేదు అసలు సినిమా అంటే సురేష్ బాబు కి ఇష్టం లేదు. ఈ విషయాన్ని రామానాయుడు కి చెప్పేశారు ఒక మంచి కథ దొరికినప్పుడు రామానాయుడు హీరో కోసం ఎంతగానో చూసారు. ఏ హీరోకి కూడా డేట్స్ లేవట. దాంతో కోపం వచ్చి ఇంట్లో ఒక హీరో ఉంటే కథని వాళ్లతోనే తీయవచ్చు కదా అని అనుకున్నారు.
అమెరికా నుండి వెంకటేష్ ని ఇండియాకి రప్పించారు సినిమా మీద ఆసక్తి వచ్చేలా చేశారు యాక్టింగ్ కూడా నేర్పించారు వెంకటేష్ కి ఇష్టం లేకపోయినా ఇండస్ట్రీలోకి బలవంతంగా అయినా తీసుకువచ్చారు. ఇలా వెంకటేష్ హీరో అవ్వడం వెనక ఇంత పెద్ద స్టోరీ ఉంది.
Also read:
- ఫ్లాపులిచ్చిన హీరోయిన్ కోసం… ఎందుకు చిరు ఇంతలా ఎదురు చూస్తున్నారు…?
- రాత్రిపూట ఏ టైం కి అన్నం తినాలి..? ఈ సమయంలో మాత్రం అస్సలు వద్దు..!
- చాణక్య నీతి: వైవాహిక జీవితం లో సమస్యలు రాకుండా ఉండాలంటే.. వీటిని తప్పక పాటించాలి..!