నిత్యం తాగుడుకు బానిసైన వారికి ఆసరా ఇచ్చేందుకు 1935లో ఆల్కహాలిక్ ఎనానిమస్ ఫెలోషిప్‌గా ఏర్పాటు అయినది. మద్యంమునకు దాసుడైన ఓ వ్యక్తి మరొక వ్యసనపరుడితో సమావేశం కావడంతోనే ఇందుకు బీజం వేసింది. 1957లో భారత్‌లో ఆవిర్బవించింది.
Advertisement
ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయంలో పని చేసే ఓ అమెరికా పౌరుడు ఇచ్చిన పత్రికా ప్రకటన చూసిన ముంబయివాసి ఒకరెళ్లి అతన్ని కలిసాడు.
ఆవిధంగా ముంబయిలో ఏ.ఏ.ఫెలోషిఫ్ ప్రారంభమైంది. అందులో చేరిన రెండవ వ్యక్తి ముంబయిలోని ఓ సైనికాధికారి. అతడు పని చేసిన చోటల్లా ఈ ఫెలోషిప్‌లు ఏర్పాటు చేసుకుంటూ వెళ్లారు. ఆవిధంగా తెలుగు రాష్ట్రాలలో కూడా 1967లో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో తొలిసారి పెలోషిప్ ఏర్పాటైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2500 ఏ.ఏ. బృందాలు ఉండగా దాదాపు 50వేల మంది వరకు ఈ వ్యసనం నుంచి విముక్తి పొందారు. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, కొత్తగూడం, మిర్యాలగూడ, మంచిర్యాల, ఆంధ్రప్రదేశ్, తిరుపతి, విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, రాజమండ్రి ఇలా దాదాపు 200 బృందాలు ఏ.ఏ. తరుపున పని చేస్తున్నాయి వీటి ద్వారా వందల మంది మద్యపానం నుంచి విముక్తి పొందారు.
Advertisement
Also Read: బాలీవుడ్ స్టార్ హీరోకు కరోనా పాజిటివ్..!
ముఖ్యంగా ఒక తాగుబోతును మరొక తాగుబోతు బాగా అర్థం చేసుకుంటాడనే భావన నుంచే ఏ.ఏ. పుట్టింది. ఈ బృందంలో చేరడానికి ఎలాంటి రుసుముండదు. సమీక్షల ద్వారా ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా 12 సోపనాలు.. 12 సాంప్రదాయాలు అనే విధానం ద్వారా మద్యం సేవించే వారిని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మద్యపాన దురలవాటుకు దాసులు అయిన తప్పిదం తెలుసుకుని దాని నుంచి బయటపడాలనుకునే వారికి చేయూతనిస్తోంది. ఆల్కహాలిక్స్ ఎనానిమస్ స్వచ్ఛంద సంస్థ కేవలం ఓదార్పు మాటల ద్వారానే బాదితులకు సాంత్వన చేకూర్చుతున్నది.
Also Read: viral video : తాలిబన్ల రాజ్యంలో మద్య నిషేదం…3వేల లీటర్ల మద్యం నేలపాలు..!